Viral Video: వీడెవడండీ బాబు.! ఏకంగా పామును ముద్దాడాడు.. షాకింగ్ వీడియో వైరల్.!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలామంది తమ ప్రాణాలను సైతం రిస్క్ చేస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్లు...

Viral Video: వీడెవడండీ బాబు.! ఏకంగా పామును ముద్దాడాడు.. షాకింగ్ వీడియో వైరల్.!
Snake Video
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 01, 2021 | 4:12 PM

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి చాలామంది తమ ప్రాణాలను సైతం రిస్క్ చేస్తున్నారు. ఓవర్ నైట్ స్టార్లు అయిపోవడానికి సుసాధ్యం కాని స్టంట్స్ అన్ని చేస్తున్నారు. ఇక ఇప్పుడు మీకు చూపించబోయే వీడియో కూడా ఇదే కోవకు చెందినది. వెర్రీ పీక్స్‌కి చేరడం అంటే ఇదేనేమో.! వ్యూస్, లైకుల కోసం ఓ యువకుడు పడగ విప్పిన పామును ముద్దాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ పడగ విప్పి ఉన్న పామును ఓ యువకుడు ముద్దాడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోను ‘Goga Ni Daya’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్ పోస్ట్ చేసింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్, లైకులు వచ్చి పడుతున్నాయి.

విష సర్పాలు, క్రూర మృగాలతో సెల్ఫీలు, వీడియోలు దిగటం కొంచెం థ్రిలింగ్‌గా ఉన్నప్పటికీ.. ఇలాంటి స్టంట్స్ ప్రాణాలకు ప్రమాదమని.. ఏదైనా తేడా వస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నెటిజన్లు అతడిపై ఫైర్ అవుతున్నారు. కొంతమంది అయితే ఇది ఫేక్ వీడియో అంటూ కొట్టి పారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.

Also Read:

పైకి చూస్తే ఫ్రిడ్జ్ డోర్.. తెరిచి చూస్తే ఫ్యూజులు ఔట్.. నెట్టింట వైరల్!

ఏం ఐడియా గురూ.! ఇతడి తెలివికి ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.!