AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏం ఐడియా గురూ.! ఇతడి తెలివికి ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.!

'నీడ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్' అని పెద్దలు అంటుంటారు. తెలివి ఎవరి సొత్తు కాదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తమ...

Viral Video: ఏం ఐడియా గురూ.! ఇతడి తెలివికి ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.!
Bike Video
Ravi Kiran
|

Updated on: Oct 30, 2021 | 1:33 PM

Share

‘నీడ్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అని పెద్దలు అంటుంటారు. తెలివి ఎవరి సొత్తు కాదు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తమ తెలివిని, సామర్ధ్యాన్ని ఏదొక సమయంలో ప్రదర్శిస్తారు. గొప్ప ఇన్వెన్షన్లను చేసి అందరినీ ఆశ్చర్యపరుస్తారు. అప్పుడప్పుడూ పనికిరాని వస్తువులతో సామాన్యులు చేసే ఆర్ట్ వర్క్స్‌ ఇంజినీర్లను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మీరూ దాన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతారు. వాస్తవానికి ఇది పాత వీడియో అయినప్పటికీ.. మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఈ మధ్యకాలంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ద్రవ్యోల్బణం కారణంగా, పెట్రోల్ ధరలు పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓ వ్యక్తి తన తెలివిని ఉపయోగించి బైక్‌ను సైకిల్‌గా మార్చాడు. దాని వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండ్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం, వినూత్న ఆలోచనతో ఓ వ్యక్తి తన మోటార్‌సైకిల్‌ను సైకిల్‌గా మార్చడాన్ని మీరు చూడవచ్చు. అతడి తెలివికి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతారు. ఆ వ్యక్తి తయారు చేసిన మోడల్‌కి పైభాగం బైక్ కాగా.. క్రింద భాగం సైకిల్‌.. దాన్ని అతడు రోడ్డుపై నడపడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు.

కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో ‘Paramount_Cycle_Store’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పోస్ట్ చేయగా.. దీనిని నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. అతడు చేసిన పని అద్భుతంగా ఉందని కొందరు వ్యాఖ్యానించగా.. ‘నిజమే! ఇతడి తెలివి అమోఘం. ఐన్‌స్టీన్, న్యూటన్‌ల బుర్రను అప్పుగా తీసుకుని ఉంటాడు’ అని మరొకరు ఫన్నీ కామెంట్ పెట్టారు.