Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనకున్న ఆ జబ్బును జంతువులకూ తగిలించేశాం.. వీడియో చూస్తే మీరూ నిజమే అని ఒప్పుకుంటారు!

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ నిత్యావసరంగా మారింది. మొబైల్ లేకుంటే ఏదో మిస్సైనట్లు అనిపిస్తుంది. ఫోన్ అంతగా మనిషిలో భాగం అయిపోయింది. ఉదయాన్నే లేచింది మొదలు అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్‎తోనే గడిపేవారు చాలా మంది ఉన్నారు...

Viral Video: మనకున్న ఆ జబ్బును జంతువులకూ తగిలించేశాం.. వీడియో చూస్తే మీరూ నిజమే అని ఒప్పుకుంటారు!
Monkey
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Oct 30, 2021 | 1:25 PM

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి మొబైల్ నిత్యావసరంగా మారింది. మొబైల్ లేకుంటే ఏదో మిస్సైనట్లు అనిపిస్తుంది. ఫోన్ అంతగా మనిషిలో భాగం అయిపోయింది. ఉదయాన్నే లేచింది మొదలు అర్ధరాత్రి పడుకునే వరకు ఫోన్‎తోనే గడిపేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యుతులో ఫోన్ ఒక భాగమైంది. సోషల్ మీడియా, గేమ్స్‎కు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు ఫోన్ ఉపయోగించినా అది వీటి కంటే తక్కువే. మొదట్లో ఫోన్ కేవలం మాట్లాడానికే ఉపయోగించే వారు. కానీ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు రావటం, తక్కువ ధరకే నెట్ దొరుకుతుండడంతో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్లు విరివిగా వాడుతున్నారు.

ఇంతకు ముందు టిక్ టాక్, పబ్జీ గేమ్ ఉన్నప్పుడు వాటి కోసమే కొందరు ఫోన్ ఎక్కువగా ఉపయోగించేవారు. వాటిని బ్యాన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్‎స్టా రిల్స్‎తో బిజీగా మారారు. ఇద్దురు కలిసి ఉన్నా వారు వారి ఫోన్లతో బిజీగా ఉంటున్నారే తప్పు ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు. పెద్ద వాళ్ల పరిస్థితి ఇలా ఉంటే పిల్లలు కూడా ఫోన్‎కు బానిసలవుతున్నారు. సంవత్సరం వయసు రాగానే వారికి ఫోన్ ఇవ్వడంతో వారు మొబైల్‎కు అడిక్ట్ అవుతున్నారు. ఇలా చాలా మంది పిల్లులు బయటకు వెళ్లకుండా ఫోన్‎తో ఆడుకుంటూ ఇళ్లలో ఉండి ఉబకాయం బరిన పడుతున్నారు. అంతేకాకుండా మానసికంగా కూడా దెబ్బ తింటున్నారు.

మొబైల్‎కు మనుషులే కాదు జంతువులు కూడా బానిసలైపోతున్నాయి. మనుషులు తమకున్న ఫోన్ రోగాన్ని పెంపుడు జంతువులుకు అంటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోలో ఓ కోతి ఫోన్ వాడుతూ బిజీగా కనిపిస్తుంది. కోతి పక్కకు ఓ యువతి కూడా ఉంది. ఈ వీడియోన్ ట్విట్టర్‎లో పోస్ట్ చేసి “మనుషుల నుంచి జంతువులకు వ్యాధి అంటుకుంటుందని” వ్యగ్యంగా క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. అయితే మొబైల్‎ను మితంగా వాడితేనా మంచిదని లేకుండా అనర్థలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

చైనాలోని బీజింగ్‎లో ఈ సంవత్సరం చాలా మంది యువకులు ఆన్‎లైన్ గేమ్‎లకు బానిసగా మారారు. ఇటీవలి కాలంలో విద్యా మంత్రిత్వశాఖ మైనర్లు గేమ్‎లు ఆడే సమయంపై పరిమితి విధించింది. శుక్రవారం, శనివారం, ఆదివారం మాత్రమే ఒక గంట పాటు ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటానికి వీలు కల్పిస్తుంది.

Read Also.. Viral News: ఫోన్‌లో ఆడుతూ ఊహించని పని చేసిన చిన్నారి.. అది చూసి షాక్ అయిన తల్లింద్రుడులు..

Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!