Viral News: ఫోన్‌లో ఆడుతూ ఊహించని పని చేసిన చిన్నారి.. అది చూసి షాక్ అయిన తల్లింద్రుడులు..
Viral News: చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు ఎంత నవ్వు తెప్పిస్తాయో అలాగే కొన్ని ఇబ్బందుల్ని సృష్టిస్తాయి. ఫోన్ ఆపరేట్ చేయడం పెద్దలకి రాకపోవచ్చునేమో కానీ..
Viral News: చిన్నపిల్లలు చేసే కొన్ని పనులు ఎంత నవ్వు తెప్పిస్తాయో అలాగే కొన్ని ఇబ్బందుల్ని సృష్టిస్తాయి. ఫోన్ ఆపరేట్ చేయడం పెద్దలకి రాకపోవచ్చునేమో కానీ పిల్లలకు వెన్నతో పెట్టిన విద్య. కరోనా లాక్‌డౌన్‌లతో పిల్లలు ఇళ్లకే పరిమితమవ్వడంతో ఫోన్‌లు, ల్వాప్‌టాప్‌లతోనే ఆన్‌లైన్ చదువులకు అలవాటు పడ్డారు. ఇక విషయంలోకివెళ్లితే…..ఎనిమిదేళ్ల పాప వాళ్ల తల్లి ఫోన్‌లో ఆడుతూ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ నుంచి సెలవుల్లో తమ ఫ్యామిలీ టూర్‌లో ఉల్లాసంగా గడిపేందుకు కావల్సిన వస్తువులను ఆన్‌లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేసింది. ఇంతకీ ఆమె ఏం కొనుగోలు చేసిందంటే ఒక ఎయిర్ మాట్రిసెస్, ఒక దిండు, దుప్పట్లు, వంటగదికి సంబంధించిన గిన్నెలు, ప్యాన్‌లు, కప్పులు, కత్తులు.
కాగా.. ఆ ట్రిప్‌లో వినోదం కోసం, హ్యారీ పోటర్ పుస్తకాల బాక్స్ సెట్‌ను, హ్యారీ పోటర్ లెగో గేమ్ అలాగే మైక్రోస్కోప్‌ను ఆర్డర్ చేసింది. అంతే కాసేపటికి తల్లి తన ఫోన్ చూస్తే ‘ఆఫ్టర్ పే’ నోటిఫికేషన్ ప్రత్యక్షం కావడంతో కంగుతింది. ఆ తర్వాత ఏంటిది అని చూస్తే తన కూతురు ఆన్‌లైన్ నుంచి రూ. 61 వేలు ఖరీదు చేస్తే వస్తువులను ఆర్డర్ చేసినట్టు గుర్తించి వెంటనే ఆ ఆర్డర్‌ని కేన్సిల్ చేసింది. ఈ మేరకు ఆ బాలిక తల్లి తన కూతురు ఏ విధంగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసింది వంటి వాటి గురించి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదంటూ విమర్శిస్తూ రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు.
Also read:
Kachidi Fish: ఒక్క చేపతో వారి సుడి తిరిగింది.. ఎంతకు అమ్మారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!