Winter Drinks: శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ డ్రింక్స్‌ తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..

Winter Drinks: శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి.

Winter Drinks: శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఈ డ్రింక్స్‌ తప్పనిసరి..! ఏంటో తెలుసుకోండి..
Winter Drinks
Follow us

|

Updated on: Nov 01, 2021 | 3:32 PM

Winter Drinks: శీతాకాలం వచ్చేసింది. శరీరం వెచ్చగా ఉండాలంటే ఎక్కువ శక్తి అవసరం. అంతేకాకుండా జీవక్రియను వేగవంతం చేయడానికి ఎక్కువ పోషకాలు కావాలి. అటువంటి పరిస్థితిలో మీరు డైట్‌లో డిటాక్స్ డ్రింక్‌ని చేర్చుకుంటే మంచిది. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా బరువు తగ్గడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జుట్టు, చర్మాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతాయి. శీతాకాలంలో డైట్‌లో ఏ డిటాక్స్ డ్రింక్స్ చేర్చాలో తెలుసుకుందాం.

1. దానిమ్మ, దుంప రసం దానిమ్మ, బీట్‌రూట్‌తో చేసిన డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవచ్చు. ఇందులో శరీరానికి అవసరమయ్యే అనేక పోషకాలు ఉంటాయి. మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.

2. పసుపు టీ పసుపు టీలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపు కాలేయ పనితీరును మెరుగుపరచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

3. ఆరెంజ్, అల్లం, క్యారెట్ రసం ఆరెంజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్‌, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు సహాయపడతాయి. అల్లం జీర్ణక్రియ, ఉబ్బరం, కడుపు తిమ్మిరి వ్యాధులకు మంచి నివారణ.

4. ఉసిరి రసం ఇందులో పెద్ద మొత్తంలో విటమిన్ సి ఉండటమే కాకుండా శరీరంలోని జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

5. బచ్చలికూర, క్యారెట్, ఆపిల్ రసం ఈ కలయిక పోషకాలతో నిండి ఉంటుంది. బచ్చలికూర చేదు రుచి కారణంగా ఇందులో క్యారెట్, యాపిల్ రసాలను జోడిస్తే మంచిగా ఉంటుంది.

Divya Bharti: దివంగత నటి దివ్య భారతి తండ్రి మృతి.. చివరి వరకు ఆమె భర్త దగ్గరే నివాసం..

T20 World Cup: భారత జట్టుకు మద్దతుగా పీటర్సన్.. ఆటగాళ్లకు అండగా నిలవాలని హిందీలో ట్వీట్..

Viral Video: పెళ్లిలో కోపంతో ఊగిపోయిన వధువు.. పెళ్లికూతురు చేసిన పనికి వరుడు షాక్..