T20 World Cup: భారత జట్టుకు మద్దతుగా పీటర్సన్.. ఆటగాళ్లకు అండగా నిలవాలని హిందీలో ట్వీట్..

ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇండియా రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది...

T20 World Cup: భారత జట్టుకు మద్దతుగా పీటర్సన్.. ఆటగాళ్లకు అండగా నిలవాలని హిందీలో ట్వీట్..
Piterson
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 01, 2021 | 3:16 PM

ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడిన ఇండియా రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. వరుస ఓటములతో టీం ఇండియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ భారత జట్టుకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరాడు. భారతీయ అభిమానుల కోసం పీటర్సన్ హిందీలో ట్వీట్ చేశాడు. “క్రీడలలో గెలుపు, ఓటములు ఉంటాయి. ఏ ఆటగాడు ఓడిపోవడానికి ఆట ఆడడు. మీ దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం. క్రీడాకారులు రోబోలు కాదని, వారికి అన్ని సమయాల్లో మద్దతు అవసరమని దయచేసి గ్రహించండి.” అంటూ ట్వీట్ చేశాడు.

టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కివీస్ బౌలర్ల కెప్టెన్ సరైన నిర్ణయం తీసుకున్నారని నిరూపించడానికి వారికి ఎంత సమయం పట్టలేదు. మొదటి నుంచి ఇండియాను బ్యాటర్లను కట్టడి చేశారు. భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా 26 పరుగులతో నాటౌట్‎గా నిలిచాడు. హార్దిక్ పాండ్యా 23 పరుగులు చేయగా.. కేఎల్ రాహుల్ 18, రోహిత్ శర్మ 14, రిషబ్ పంత్ 12 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీశాడు. టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే చెరో వికెట్ తీశారు.

లక్ష్యసాధనకు దిగిన కివీస్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించారు. డార్లీ మిచెల్ 49 పరుగుల చేయగా మార్టిన్ గప్టిల్ 20 పరుగులు చేశాడు. కెప్టెన్ విలియమ్సన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. డెవాన్ కాన్వే కూడా రెండు పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారత్ రెండు మ్యాచ్‎ల్లో ఓడిపోవటంతో సమీస్ చేరుకోవటం కష్టతరంగా మారింది. ఇండియా సెమీఫైనల్‌కు వెళ్లాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలవాలి. ఆఫ్ఘనిస్తాన్, నమీబియా మరియు స్కాట్లాండ్‌లపై విజయం సాధించాలి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన తర్వాత మిగతా జట్ల ఫలితాలపై భరత్ ఆధారపడాల్సి వస్తుంది. గ్రూప్-2లో మూడు మ్యాచ్‎ల్లో విజయం సాధించి అగ్రస్థానంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. ఇండియా ఐదో స్థానంలో నిలిచింది.

Read Also.. T20 World Cup 2021: టీమిండియాకు అసలు ఏమైంది.? టీ20లో వైఫల్యానికి కారణమేంటి.? తెరపైకి వస్తోన్న అంశాలు ఇవే..