AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2021: ఆటగాళ్లు అలసటగా ఉన్నారు.. విరామం అవసరం.. జస్ప్రీత్ బుమ్రా..

కోవిడ్-19 మహమ్మారితో ఇండియా జట్టు బబుల్‎లో ఉండి అలసట చెందిందని ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా T20 ప్రపంచ కప్‌లో రెండో ఓటమి తర్వాత అన్నారు. భారత జట్టు ఆదివారం సూపర్ 12లో న్యూజిలాండ్‌ జరిగిన మ్యాచ్‎లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది...

T20 World Cup 2021: ఆటగాళ్లు అలసటగా ఉన్నారు.. విరామం అవసరం.. జస్ప్రీత్ బుమ్రా..
Bumra
Srinivas Chekkilla
|

Updated on: Nov 01, 2021 | 3:48 PM

Share

కోవిడ్-19 మహమ్మారితో ఇండియా జట్టు బబుల్‎లో ఉండి అలసట చెందిందని ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా T20 ప్రపంచ కప్‌లో రెండో ఓటమి తర్వాత అన్నారు. భారత జట్టు ఆదివారం సూపర్ 12లో న్యూజిలాండ్‎తో జరిగిన మ్యాచ్‎లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ గ్రూప్-2లో ఐదో స్థానానికి పడిపోయింది. భారత్ సెమీ ఫైనల్‎కు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఏప్రిల్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆటగాళ్లు బబుల్‎లోఉన్నారు.

సెప్టెంబరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐపీఎల్ రెండో దశ ప్రారంభం కావడానికి ముందు భారత టెస్ట్ జట్టు ఇంగ్లాండ్‌లో కూడా పర్యటించింది. టీ20 ప్రపంచకప్‌కు వారం ముందు ఐపీఎల్ సీజన్ తర్వాత జట్టు అలసిపోయిందా అని అడగ్గా “కచ్చితంగా, కొన్నిసార్లు మీకు విరామం కావాలి. మీరు మీ కుటుంబాన్ని కోల్పోతారు. మీరు ఆరు నెలలుగా రోడ్డుపైనే ఉన్నారు. “కాబట్టి అవన్నీ కొన్నిసార్లు మీ మనస్సు వెనుక ఆడతాయి. కానీ మీరు మైదానంలో ఉన్నప్పుడు, మీరు అవన్నీ ఆలోచించరు అని అన్నాడు.

“బీసీసీఐ కూడా మాకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది కష్టమైన సమయం. కొన్నిసార్లు బబుల్ ఉండడం వల్ల అలసట, మానసిక అలసట కూడా వస్తుందన్నాడు.” న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‎లో భారత్ 11 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 48 పరుగులకు చేసి కష్టల్లో పడింది. మంచు వల్ల బౌలింగ్ సరిగా పడలేదని అన్నాడు. భారత ఓపెనర్లుగా వచ్చిన ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఇషాన్ కిషన్ (4) ట్రెంట్ బౌల్ట్ వేసిన బాల్‌ను భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అనంతరం కేఎల్ రాహుల్ (18 పరుగులు, 16 బంతులు, 3 ఫోర్లు) సౌథీ బౌలింగ్‌లో మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో 35 పరుగులకు భారత్ రెండు వికెట్లు కోల్పోయి, పేలవ ఆటతీరును కనబరిచింది. కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సిన సమయంలో రోహిత్ శర్మ (14 పరుగులు, 14 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ (9 పరుగులు) కూడా ఓ రాంగ్ షాట్ ఆడే క్రమంలో నాలుగో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. సౌథీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే క్రమంలో బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. జడేజా, హార్దిక్ కాస్త రాణించడంతో ఇండియా 110 పగురులు చేసింది. న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Read Also.. T20 World Cup: భారత జట్టుకు మద్దతుగా పీటర్సన్.. ఆటగాళ్లకు అండగా నిలవాలని హిందీలో ట్వీట్..