Viral Video: పెళ్లిలో కోపంతో ఊగిపోయిన వధువు.. పెళ్లికూతురు చేసిన పనికి వరుడు షాక్..

పెళ్లిలో సరదాలు.. ఆనంద క్షణాలు అనేకం ఉంటాయి. ఇక ఇరు కుటుంబ సభ్యులు.. బంధువులతో.. వధువరుల స్నేహితులతో

Viral Video: పెళ్లిలో కోపంతో ఊగిపోయిన వధువు.. పెళ్లికూతురు చేసిన పనికి వరుడు షాక్..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 01, 2021 | 3:02 PM

పెళ్లిలో సరదాలు.. ఆనంద క్షణాలు అనేకం ఉంటాయి. ఇక ఇరు కుటుంబ సభ్యులు.. బంధువులతో.. వధువరుల స్నేహితులతో మండపం మొత్తం ఎంతో సందడిగా ఉంటుంది. అలాంటి ఎంతో సంతోషకరమైన సందర్భంలో బంధువులలో ఎవరో ఒకరికి కోపం రావడం సహజం.. కానీ పెళ్లి కూతురికే కోపం వస్తే ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వధువు మాత్రం కోపంతో ఊగిపోయింది. మండపంలోనే అబ్బాయిని కోపంతో తిట్టిపోస్తూ.. వరుడిపై విరుచుకుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్‏లో పెళ్లిల్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అలాగే పెళ్లి వేడుకలో ఎన్ని వింత ఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్ని కడుపుబ్బా నవ్వించగా.. మరికొన్ని కాస్త షాకింగ్ గా అనిపిస్తాయి. కానీ ఇక్కడ ఓ వధువు మాత్రం వరుడిపై కోపంతో విరుచుకుపడింది.

ఆ వీడియోలో వధువు.. వరుడు పూల దండలు మార్చుకునే సమయంలో పెళ్లి కూతురు ప్రవర్తనకు అక్కుడున్న వారంతా షాకయ్యారు. పెళ్లిలో వధువరులిద్దరూ జయమాలలు మార్చుకునేటప్పుడు వారి వారి స్నేహితులు ఆటపట్టించుకోవడం సహజం. అయితే ఇక్కడ కూడా వధువు పూలమాల వేసే సమయంలో వరుడు స్నేహితులు అతడినికి వెనక్కు లాగారు. అయితే అప్పటికే ఫుల్ ఫైర్ మీదున్న పెళ్లికూతురు.. మండపంపైనే పెళ్లికొడుకును తిట్టిపోసింది. సరిగ్గా నిల్చో అంటూ వెలెత్తి మరీ బెదిరించింది. మళ్లీ పూల మాల వేసే సమయంలో అతడి స్నేహితులు వెనక్కు లాగారు.. దీంతో సహనం నశించిన పెళ్లి కూతురు వరుడిపై విరుచుకుపడింది. వెనక్కు లాగిన.. అదేం పట్టనట్టుగా అతని మెడలో పూలదండ వేసింది. వధువు ప్రవర్తనకు అక్కడున్న వారంత షాకయ్యారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: Nitya Menon: టాలీవుడ్‏లో ముద్దుగుమ్మకు పెరుగుతున్న క్రేజ్.. నాని కొత్త ప్రాజెక్ట్‏లో నిత్య మీనన్..

Sunny Leone Halloween celebrations: సన్నీ లియోన్ ఇంట్లో హాలోవీన్ వేడుకలు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్…

Farmhouse Casino: ఫామ్‌హౌస్‌ క్యాసినో కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో అసలు కళావర్ కింగ్, ఇస్పేట్ రాజా..!