Viral Video: సింహంతో పరాచకాలు ఆడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది.. జస్ట్ మిస్

అడవిలో సఫారీ టూర్ చేయడం అంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అప్పటివరకు జాలో, డిస్కవరీ ఛానల్స్‌లో చూసిన జీవులను అక్కడ డైరెక్ట్‌గా చూసే అవకాశం ఉంటుంది.

Viral Video: సింహంతో పరాచకాలు ఆడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది.. జస్ట్ మిస్
Lion Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 2:00 PM

అడవిలో సఫారీ టూర్ చేయడం అంటే చాలా బెస్ట్ థింగ్ అని చెప్పాలి. అప్పటివరకు జాలో, డిస్కవరీ ఛానల్స్‌లో చూసిన జీవులను, జంతువులను అక్కడ డైరెక్ట్‌గా చూసే అవకాశం ఉంటుంది. ఫ్రీగా సంచరిస్తోన్న జంతువుల మధ్యనుంచి ఈ టూర్ సాగుతోంది. భయంకరమైన క్రూరమృగాలు ఒక్కోసారి వాహనాలపై దాడులు చేస్తూ ఉంటాయి. అలాంటి వీడియోలు చాలా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే గైడ్స్ చెప్పినట్లు విని.. సైలెంట్‌గా వాటిని చూసి వస్తే ఓకే. అతి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో సఫారీ టూర్‌కి వెళ్లిన బృందంలోంచి ఇద్దరు వ్యక్తులు అక్కడ మోస్ట్ డేంజరస్ యానిమల్ సింహంతో కామెడీ చేయబోయాడు. సఫారీ వాహానం కిటికీ అద్దం ఓపెన్ చేసి.. ఒకరు సింహాన్ని టచ్ చేయబోగా.. మరొకరు దాన్ని దగ్గరగా ఫోటోలు తీయబోయారు. దీంతో సింహం కన్ను వీరిపై పడింది. ఒక్కసారిగా కోపంతో గాండ్రిస్తూ దాడిచేయబోయింది. దీంతో కిటికీ పక్కనే ఉన్న యువకుడు ఒక్క ఉదుటన పక్కకు తప్పుకున్నాడు. అతికష్టం మీద.. వెంటనే వాహనం అద్దాలు మూసేసి బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. భూమి మీద గడ్డి గింజలు ఉండబట్టి బ్రతికిపోయారు కానీ లేదంటే సీన్ మరోలా ఉండేది. సింహం ఇంకాస్త అగ్రెసీవ్‌గా దాడి చేసి ఉంటే.. పరిస్థితులు ఊహించడం కూడా కష్టమే. ఆ వీడియో మీరూ ఓ లుక్కేయండి.

ఈ వీడియో పాతదే అయినప్పటికీ నెట్టింట మరోసారి వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. జంగిల్‌కి వెళ్లి అడవికి రాజైన సింహంతో పరాచకాలు ఆడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. అదృష్టవంతులు అంటే వీళ్లే.. సింహం నోటి వద్దకు వెళ్లి కూడా ఎలానో సజీవంగా వెనక్కి రాగలిగారు అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

Also Read: Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో.. Watch

Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !