Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో.. Watch

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు.

Chiranjeevi: దెయ్యం​ లుక్​లో మెగాస్టార్.. నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో.. Watch
Chiru New Look
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 11:38 AM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు. దెయ్యం లుక్‌లో నయా అవతార్‌ను చూపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ లుక్​ మూవీకి సంబంధించి కాదు. అక్టోబర్​ 31న హలోవీన్ డే. సో చాలామంది సెలబ్రిటీస్ ఫన్ మోడ్‌లో, ఘోస్ట్ గెటప్స్‌లో ఈ ఈవెంట్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు.  ఇందులో భాగంగానే చిరు కూడా దెయ్యం లుక్​లో ఉన్న తన సరదా వీడియోను ఇన్​స్టా స్టోరీస్​లో పోస్ట్​ చేసి.. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. ‘హ్యాపీ హలోవీన్’ అంటూ విషెస్ తెలిపారు. ‘ఉత్కంఠభరితమైన రోజు’ అని కామెంట్ చేశారు. అయితే ఆయన ఈ లుక్ కోసం మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఓ యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ​సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ సర్కులేట్ అవుతోంది. మీరు ఓ లుక్కేయండి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ ఫిబ్రవరి 4, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక లూసిఫర్‌ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ‘గాడ్ ఫాదర్’ చిత్రీకరణ దశలో ఉండగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ త్వరలో పట్టాలెక్కనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సినిమాలు పట్టాలెక్కిస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి.

Also Read: Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !

Naga Shaurya: హీరో నాగశౌర్యకు నోటీసులు..! పేకాట ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు