Naga Shaurya: హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులు..! పేకాట ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు

శివారుల్లో ఆదివారం సాయంత్రం ఓ భారీ పేకాట ఎపిసోడ్ బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం రేపింది.

Naga Shaurya: హీరో నాగశౌర్య తండ్రికి నోటీసులు..! పేకాట ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు
Naga Shourya
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 01, 2021 | 12:17 PM

నగర శివారుల్లో ఆదివారం సాయంత్రం ఓ భారీ పేకాట ఎపిసోడ్ బ్లాస్ట్ అయిన విషయం తెలిసిందే. హీరో నాగశౌర్య కుటుంబ సభ్యుల పేరుతో ఫామ్‌హౌస్‌లో పేకాట కలకలం రేపింది. అక్కడ మినీ క్యానినోను తలపించే రేంజ్‌లో కొనసాగుతున్న జూదాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. బ్యాన్‌ ఉన్న ఆటకు అడ్డాను సృష్టించడంతో నాగశౌర్య తండ్రికి నోటీసులిచ్చారు. దానికంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. ఒక్క ఈ ఫామ్‌ హౌస్‌లోనే కాదు.. శివారుల్లోని అనేక ఫామ్ హౌస్‌ల్లో ఇదే దందా జరుగుతోంది. నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో ఆట నడుపుతున్న నిర్వాహకుడు గుత్తా సుమంత్‌ విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి.

సుమంత్ అనే వ్యక్తి.. ఫోన్‌ను, కాల్‌ డేటాను అనలైజ్ చేస్తున్న కొద్దీ విస్తుబోయే నిజాలు బట్టబయలవుతున్నాయి. ఆయన ఈ ఒక్క ఫామ్‌హౌస్‌లోనేకాదు.. శివారుల్లోని వేర్వేరు ఏరియాల్లో వేర్వేరు ఫామ్‌హౌసుల్లో ఇదే దందా నడుపుతున్నాడని తెలుస్తోంది. ప్రతీ ఫామ్‌హౌస్‌కీ ఒక్కో వాట్సాప్‌ గ్రూప్ క్రియేట్ చేసినట్లు సమాచారం. ప్రతీ వాట్సాప్‌ గ్రూప్‌లో 200 మంది వరకూ జూదగాళ్లు ఉన్నారట. అందరూ బడాబాబులే అని తెలుస్తోంది. చిప్స్‌తో నడిచే ఈ దందాలో కార్డులు తెస్తే స్వైపింగ్ చేసుకోవచ్చు. కార్డు లేకపోతే లిక్విడ్ క్యాష్‌తో రావచ్చు. అందుకు కావాల్సిన సేఫ్టీ, సెక్యూరిటీ పక్కా అన్న భరోసాతో సుమంత్‌ ఈ డర్టీ గేమ్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలుస్తోంది.

పేకాట అంటే ముగ్గురు, నలుగురు కూర్చుని 13ముక్కలు పంచుకుని, వంద రెండు వందలు పెట్టి ఆడడం కాదు. ఇలాంటి ఘటనలు తరచూ బయడపడుతున్నాయి. కానీ వాటన్నింటినీ మించిన మినీ క్యాసినో కల్చర్ ఇది. ఇక్కడ ఆట క్యాసినో స్టయిల్‌లో ఉంటుంది. వాట్సాప్‌ గ్రూప్‌లు, చిప్స్‌, స్వైపింగ్ మిషిన్లు, డెబిట్ క్రెడిట్ కార్డులు ఉంటాయి. ఇక చేయి చాచితే చాలు.. వచ్చివాలిపోయే లిక్కర్ గ్లాస్‌లు. స్టఫ్ కోసం కావల్సిన కుజైన్‌లతో వెరైటీ ఫుడ్.. ఆహా విలాసానికి మరోపేరుగా సిటీ శివారుల్లోని ఫామ్‌హౌస్‌లు మారాయన్నది తాజా ఎపిసోడ్‌తో తేటతెల్లమైంది.

అయితే ఆ పేకాట వ్యవహారంతో తనకు ఏం సంబంధం లేదని నాగశౌర్య చెబుతున్నారు. అది తన తండ్రి పేరు మీద ఉందని.. అక్కడ ఏం జరుగుతుందో తనకు తెలియదంటున్నారు. పోలీసుల విచారణలో అసలు నిజాలు తెలియనున్నాయి.

మాదాపూర్ SoT ఆఫీస్‌ నుంచి వస్తున్న కొత్త అప్‌డేట్స్ ప్రకారం.. ఫామ్‌హౌస్‌ పేకాట వ్యవహారంలో కొత్తగా బుజ్జి అనే వ్యక్తి బయటకి వస్తోంది. ఈ బుజ్జి ఎవరో కాదు… నాగశౌర్యకు బాబాయి. అంటే.. ఫామ్‌హౌస్‌ లీజ్ అగ్రిమెంట్‌ నాగశౌర్య తండ్రి రవీంద్రప్రసాద్‌ పేరు మీద ఉంటే.. ఫామ్‌హౌస్ కార్యకలాపాన్నీ బాబాయి బుజ్జీ చూసుకుంటున్నట్లు సమాచారం. ఈయన పాత్రపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే కేసులో 20మంది ప్రముఖులు పోలీసుల లాకప్‌లో ఉన్నారు. వీళ్లందరికీ కరోనా సహా ఇతర హెల్త్‌ చెకప్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే కోర్టుకు తరలించబోతున్నారు పోలీసులు.

Also Read: శివారులో షాకింగ్ సీన్.. జూదశాలగా మారిన ఓ యువ హీరో ఫామ్‌హౌస్‌‌

Unstoppable with NBK.. ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అతిథుల లిస్ట్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే.. తారక్ కూడా !