Cyber Crime: డబ్బులు తిరిగిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..

సాధారణంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకుంటుంటారు

Cyber Crime: డబ్బులు తిరిగిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..
Follow us
Basha Shek

|

Updated on: Nov 01, 2021 | 11:02 AM

సాధారణంగా ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులు వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లను నమోదు చేసుకుంటుంటారు. తమ  పూర్తి వివరాలతో కూడిన రెజ్యూమ్ లను  అందులో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇందుకుగాను కొన్ని వెబ్‌సైట్లు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, ప్రొఫైల్‌ డిస్కవరీ పేరిట డబ్బులు కూడా వసూలు చేస్తున్నాయి. ఇలాంటి వెబ్‌సైట్లతో నిరుద్యోగ అభ్యర్థులకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో తెలియదు కానీ కొందరు మోసగాళ్ల నయా దందాకు తెరలేపారు. కొన్ని వెబ్‌సైట్ల నుంచి నిరుద్యోగుల సమాచారం తస్కరించి ‘మీ సమాచారం పోయింది. ఉద్యోగం ఇప్పిస్తాం.. లేదంటే గతంలో చెల్లించిన డబ్బులను తిరిగిచెల్లిస్తాం’ అంటూ మాయమాటలు చెప్పి నిలువునా మోసం చేస్తారు.

ఆశపడ్డారో… మోసపోతారు.. ఇటీవల ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తిని ఇలాగే బురిడీ కొట్టించారు కేటుగాళ్లు. అతనిని నమ్మించి రూ. 15.8 లక్షలు కాజేశారు. బాధితుడు సైబర్‌బాద్‌ పోలీసులను ఆశ్రయించడంతో ఈ నయా దందా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత మరికొందరు బాధితులు ఇలాగే మోసపోయామంటూ పోలీసు స్టేషన్ల గడప తొక్కారు. ఈ నేపథ్యంలో మోసగాళ్ల నయా దందా గురించి అందరికీ తెలిసేలా సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ ‘ మీరు ఏదైనా వెబ్‌సైట్‌లో రెజ్యూమ్‌ అప్‌లోడ్‌ చేశారా..రిజిస్ట్రేషన్‌, ఇతర ఛార్జీల పేరిట డబ్బులు చెల్లించారా.. ఉద్యోగం రాలేదా..అయితే చింతించకండి.. మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం..’ అంటూ కేటుగాళ్లు support@refundpayumoney.com అనే మెయిల్‌ ఐడీ నుంచి సందేశాలు పంపుతున్నారు. ఆశపడ్డారో…మోసపోతారు’ అని చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

Also Read:

Naga Shaurya: హీరో నాగశౌర్యకు నోటీసులు..! పేకాట ఎపిసోడ్‌లో విస్తుపోయే నిజాలు

V. C. Sajjanar: పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వీసీ సజ్జనార్ సెటైర్లు.. మహేష్ బాబు ఫొటోతో..

నగర శివారులో పేకాట క్లబ్‌.. నడిపిస్తున్నది ఎవరో తెలిస్తే షాకవుతారు.. పోలీసుల విచారణలో సంచలన నిజాలు