Farmhouse Casino: ఫామ్‌హౌస్‌ క్యాసినో కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో అసలు కళావర్ కింగ్, ఇస్పేట్ రాజా..!

హైదరాబాద్‌ శివారులో SOT పోలీసులతో కలిసి టీవీ9 చేసిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఔరా అనిపించే రేంజ్‌లో జరిగిన మూడు ముక్కలాట వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.

Farmhouse Casino: ఫామ్‌హౌస్‌ క్యాసినో కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో అసలు కళావర్ కింగ్, ఇస్పేట్ రాజా..!
Farm House Casino Case
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 01, 2021 | 12:28 PM

Farm House Casino Case: హైదరాబాద్‌ శివారులో SOT పోలీసులతో కలిసి టీవీ9 చేసిన జాయింట్‌ ఆపరేషన్‌లో ఔరా అనిపించే రేంజ్‌లో జరిగిన మూడు ముక్కలాట వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. లక్షలు కుమ్మరించి ఆడుతున్న పేకాటలో బడా నేతలు, సెలబ్రేటీలు ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో హీరో నాగశౌర్య బాబాయ్ పేరు బయటకు వచ్చింది. జూదం నిర్వహిస్తున్న గుత్తా సుమన్ కుమార్‌తో పాటు మరి కొందరిని పోలీసులు విచారిస్తున్నారు. సుమన్‌కు నాగ శౌర్యకు మధ్య సంబంధాలపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు తెరపైకి నాగ శౌర్య బాబాయ్ బుజ్జి పేరు రావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, గుత్తా సుమన్ కుమార్ ఫోన్‌ని పోలీసులు సీజ్ చేశారు. నగరానికి చెందిన 20 మంది ప్రముఖుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నాగశౌర్య ఇక్కడ పబ్లిక్ ఫిగర్ కావచ్చు.. ఫామ్‌హౌస్‌ అగ్రిమెంట్‌ ఆయన తండ్రిపేరు మీద ఉండొచ్చు.. ఆయన బాబాయ్‌ బుజ్జి పాత్ర కూడా పేకాటలో ఉండొచ్చు. కానీ ఫామ్‌హౌస్‌లో క్యాసినో తరహా ఆట వెనుక ఉన్న అసలు ఇస్పేట్ రాజా, కళావర్‌ కింగ్‌ గుత్తా సుమన్‌. ఈయన గురించి చెప్పాలంటే చేంతాడంత కహానీ ఉందంటారు విజయవాడ వాసులు. ఎందుకంటే సార్ అక్కడే మామిడి తోటల్లో పేకాట శిబిరాలతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత రియల్టర్‌ అవతారం ఎత్తాడు. జీఎస్కే గ్రూప్, సత్యసాయి హోమ్స్ పేరిట బిజినెస్ నడిపాడు.

గుత్తా సుమన్ కుమార్.. ఘరానా కేటుగా పేరుంది.. మాటలు చెప్పడంలో మహా మాయగాడు. గారడీ చేసి జనాన్ని ముంచేస్తాడన్న టాక్ ఉంది. ఆ మాటలు, ఆ మాటలతో మునిగిన జనం ఎప్పుడు ఏం చేస్తారో అన్న భయంతోనో, లేదంటే బిల్డపో తెలీదుగానీ ఇప్పుడూ ఇద్దరు గన్‌మెన్‌లను పక్కనే పెట్టుకుంటాడు సుమన్. మామిడి తోటల్లో పేకాట, రియల్టర్‌ అవతారం తర్వాత ఆయన ఓ ఛానల్‌కి డైరెక్టర్‌కు కూడా చేరాడు. దాన్ని అడ్డం పెట్టుకుని సెటిల్‌మెంట్లు, దందాలు చేస్తూ ఉండేవాడంటున్నారు. ఈ మధ్యే ఓ భూకబ్జా వ్యవహారంలో విజయవాడ నుంచి పారిపోయిన సుమన్.. నిన్న టీవీ9తో కలిసి SOT పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఇలా మినీ క్యాసినో నిర్వహిస్తూ ప్రత్యక్షమయ్యాడు.

అసలేం జరిగిందంటే.. యంగ్ హీరో నాగశౌర్యకు చెందిన ఇంటిలో పెద్ద ఎత్తున పేకాట సాగుతోంది. మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసులు ఆదివారం ఆ ఇంటిపై దాడి చేయగా.. పేకాట రాయుళ్లు పట్టుబడ్డారు. నార్సింగ్‌ పోలీస్టేషన్‌ పరిధిలోని మంచిరేవుల ప్రాంతంలో గ్రీన్‌ల్యాండ్స్‌ కాలనీలోని ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌లో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టీవీ9తో పాటు ఎస్‌వోటీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేసి, దాడి చేశారు. 30మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6.77 లక్షల నగదు, 33 మొబైల్‌ ఫోన్లు, 29 పేకాట సెట్లు, రెండు కాసినో కాయిన్లు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇంటిని నాగశౌర్య అద్దెకు తీసుకున్నప్పటికీ.. గుట్ట సుమన్‌కుమార్‌ అనే వ్యక్తి పేకాటను నిర్వహిస్తున్నట్లు ప్రాథమికంగా నార్సింగ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

Read Also… Breaking: నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. అతడు ఎవరంటే..?