Kupanti Plant Uses: చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి సహజమైన ఔషధం ఈ మొక్క..

Kupanti Plant Uses: ప్రకృతిలో ఉన్న మొక్కలే మనకు అనేక వ్యాధులను నివారించే ఔషధాలు. మన చుట్టుపక్కన ఉన్న మొక్కలను పిచ్చి మొక్కలని, కలుపు మొక్కలని..

Kupanti Plant Uses: చిన్న పిల్లల్లో నులిపురుగుల సమస్యకు చక్కటి సహజమైన ఔషధం ఈ మొక్క..
Kupanti Plant Uses
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2021 | 4:17 PM

Kupanti Plant Uses: ప్రకృతిలో ఉన్న మొక్కలే మనకు అనేక వ్యాధులను నివారించే ఔషధాలు. మన చుట్టుపక్కన ఉన్న మొక్కలను పిచ్చి మొక్కలని, కలుపు మొక్కలని వాటిని పట్టించుకోము.. కానీ అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయట. ముఖ్యంగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగించే బుడమ కాయ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ మొక్కను కుప్పిట , మొక్క, బుడమకాయ మొక్క, బుడ్డ మొక్క, అడవి టమాటా అని కూడా అంటారు. ఈ మొక్కను ఇంగ్లీష్ లో వైల్డ్ టమాటా అని , గ్రౌండ్ చెర్రీ, వింటర్ చెర్రీ అని రకరాలుగా పిలుస్తారు. ఈ మొక్కలు ఆకులు మృదువుగా ఉంటాయి. అందుకనే దీనిని మృదుమొక్కని సంస్కృతంలో పిలుస్తారు. ఈ మొక్కకు గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. ఇది తీపి పులుపు కలిసి విచిత్రమైన రుచితో ఉంటాయి. ఈ కాయలు పైన సన్నటి పొర లాంటి కవచం ఉండి లోపల చిన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు పచ్చగా పండినప్పుడు టమాటా రంగులో ఉంటాయి . ఈరోజు బుడమ కాయ ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*అనేక పోషకాలు, ఖనిజాలు, కాలిష్యం, అనేక విటమిన్లు కలిగి ఉంది. ఈ మొక్కను హెపటైటిస్, మలేరియా, రుమాటిజం, క్యాన్సర్, వంటి అనేక వ్యాధులకు నివారణగా పనిచేస్తుంది. *చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్యను ఈ పండ్లనివారిస్తాయి. *మలబద్దకం సమస్యను నివారిస్తుంది. గర్భవతికి మంచి ఔషధం *గాయపడిన పడినవారికి రక్త స్రావం తగ్గించడానికి ఈ కాయల పసరు అప్లై చేస్తారు. *ఈ కాయలను తినడం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడుతుంది. *ఆకులపై నూనెరాసి.. సెగగడ్డలపై పెడితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. *ఈ కాయలలోనే కాకుండా ఆకుల్లో విటమిన్ ఏ అధికంగా ఉంది. కంటికి సంబంధించిన సమస్యలను నివారిస్తుంది. *కీళ్ల నొప్పులు మోకాలు నొప్పులు ఉన్నవారు ఈ ఆకులను తెచ్చి మెత్తగా నూరి నొప్పులున్న చోట కట్టడం వలన నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ సి .. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. *ఈ ఆకులను, కాయలను గిరిజనలు  ఆహారంగా తీసుకుంటారు. కూరలు చేసుకుంటారు. *అన్ని మూత్ర సమస్యలను నివారిస్తుంది. *వేర్ల కషాయం అనేక వ్యాధులను నివారిస్తుంది.

Also Read:  చలికాలం వచ్చేస్తోంది.. జలుబు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏమిటంటే..