RRR Movie Glimpse: మరో రేంజ్‌లో ట్రిపులార్.. జక్కన్న మూవీపై బిజినెస్ అంచనాలను మరింతగా పెంచేసిన గ్లింప్స్

RRR Movie Updates:  ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇండియన్‌ స్క్రీన్ మీద మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ.. బాహుబలి లాంటి విజువల్‌ వండర్‌ను తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మరో మాస్టర్ పీస్‌.

RRR Movie Glimpse: మరో రేంజ్‌లో ట్రిపులార్.. జక్కన్న మూవీపై బిజినెస్ అంచనాలను మరింతగా పెంచేసిన గ్లింప్స్
RRR Movie Glimpse
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 01, 2021 | 4:35 PM

RRR Movie Updates:  ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇండియన్‌ స్క్రీన్ మీద మోస్ట్ అవెయిటెడ్‌ మూవీ.. బాహుబలి లాంటి విజువల్‌ వండర్‌ను తెరకెక్కించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న మరో మాస్టర్ పీస్‌. జస్ట్ జక్కన్న బ్రాండ్‌ వల్లే ట్రిపులార్ మీద నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్ అవుతోంది. దీనికి తోడు ఇద్దరు టాప్ హీరోలు స్క్రీన్‌ షేర్ చేసుకోబోతుండటం.. అది కూడా ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ క్యారెక్టర్స్ కావటంతో ఆడియన్స్‌తో పాటు ఇండస్ట్రీ జనాల్లో మరింతగా క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.

తాజాగా వీడియో గ్లింప్స్‌ రిలీజ్ చేసిన ట్రిపులార్ మేకర్స్ సినిమా మీద ఉన్న అంచనాలను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. బాహుబలి సినిమాతో మేకింగ్, టేకింగ్ విషయంలో ఓ బెంచ్ మార్క్‌ను సెట్‌ చేసిన జక్కన్న.. ట్రిపులార్‌తో ఆ బారియర్స్‌ను మరో లెవల్‌కు పుష్ చేశారు. ఇద్దరు టాప్ హీరోలను బ్యాలెన్స్‌ చేస్తూ రియల్‌ క్యారెక్టర్స్‌తో ఫిక్షనల్‌ స్టోరి చేయటం అంటే కత్తిమీద సాము లాంటిందే. అలాంటి రిస్కీ ఛాలెంజ్‌ తీసుకున్న జక్కన్న వీడియో గ్లింప్స్‌తో తన సక్సెస్‌ సిగ్నల్స్ ఇచ్చేశారు.

గ్లింప్స్ లో చెర్రీ, తారక్‌ స్క్రీన్ టైమ్‌లో వేరియేషన్‌ ఉన్నా.. ఇంపాక్ట్ మాత్రం ఈక్వల్‌గా ఉందంటున్నారు ఇద్దరు హీరోల ఫ్యాన్స్. ముఖ్యంగా క్యారెక్టరైజేషన్స్‌ను రిఫ్లెక్ట్ చేసేలా.. నీరు, నిప్పు కాంబినేషన్‌లో తీసిన షాట్స్‌… ఆడియన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ వీడియో గ్లింప్స్‌ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉందంటే.. ఒక్కో ఫ్రేమ్‌ను స్క్రీన్‌ షాట్ తీపి మారి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

ట్రిపులార్ మూవీ గ్లిమ్స్..

చెర్రీ, తారక్‌ మాత్రమే కాదు.. సినిమాలో కనిపించబోయే అన్ని ఇంపార్టెంట్‌ క్యారెక్టర్స్‌కు ఈ వీడియో గ్లింప్స్‌లో స్పేస్ దక్కింది. అజయ్‌ దేవగన్‌, అలియా భట్‌లకు మంచి స్క్రీన్ టైమే దక్కింది. కానీ శ్రియ, ఒలివియాలు మాత్రం అలా తళుక్కున మెరిసి మాయమవ్వటమే ఆడియన్స్ను నిరాశపరిచింది. అయితే ఇది గ్లింప్స్ మాత్రమే.. రాబోయే రెండు నెలల్లో టీజర్‌, ట్రైలర్‌లు ఆడియన్స్‌ ముందుకు రానున్నాయి. సో మోర్ అండ్‌ మోర్‌ సర్‌ప్రైజ్‌లకు రెడీ అయిపోండి అంటూ వీడియో గ్లింప్స్‌తో సిగ్నల్ ఇచ్చారు రాజమౌళి.

బిజినెస్ పరంగానూ ట్రిపులార్ రేంజ్‌ మరో లెవల్‌లోనే ఉండబోతుందంటున్నారు ఎనలిస్ట్స్‌. సంక్రాంతి సీజన్‌లో పాన్ ఇండియా లెవల్‌లో ఫస్ట్ ఎంట్రీ ట్రిపులారే. సో బాహుబలి 2ని క్రాస్‌ చేసే రేంజ్‌ మార్కెట్ షేర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మేకర్స్‌. కోవిడ్ కారణంగా డీలా పడిన ఇండస్ట్రీకి ట్రిపులార్ సక్సెస్‌తో బూస్ట్ వస్తుందని ఆశపడుతున్న బాలీవుడ్ కూడా ఈ సినిమా సక్సెస్‌ కోసం ఎదురుచూస్తుంది. అందుకే నార్త్ నుంచి జక్కన్న సినిమాకు మంచి సపోర్ట్ అందుతోంది. రిలీజ్ టైం కూడా ట్రిపులార్‌కు కలిసొచ్చే అంశమే.. ఆ టైమ్‌లో నేషనల్ లెవల్‌లోనే కాదు… ఇంటర్‌నేషనల్ లెవల్‌లో గట్టి పోటి లేకపోవటం మన సినిమాకు మంచి ప్లస్ పాయింట్. మరి ఇన్ని పాజిటివిటీస్ మధ్య రిలీజ్ అవుతున్న ట్రిపులార్‌.. ఇండియన్ సినిమా సక్సెస్‌ రేంజ్‌ ఇది అంటూ మరో బెంచ్‌ మార్క్ సెట్ చేయటం ఖాయం అంటున్నారు క్రిటిక్స్‌.

– సతీష్ రెడ్డి జడ్డా, ET డెస్క్‌, టీవీ9 తెలుగు

Also Read..

Jr.NTR: జిమ్‏లో ఎన్టీఆర్ చేసే కసరత్తులు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

Rajinikanth: ఇంటికి చేరిన సూపర్‌స్టార్‌.. దిష్టితీసి స్వాగతం పలికిన లతా రజినీకాంత్ – Watch Video