Rajinikanth: ఇంటికి చేరిన సూపర్‌స్టార్‌.. దిష్టితీసి స్వాగతం పలికిన లతా రజినీకాంత్ – Watch Video

ఇటీవలే ఆసుపత్రిలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న రజినీకాంత్ మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. సూపర్‌స్టార్‌కు ఆయన భార్య లత హారతులతో స్వాగతం పలికారు...

Rajinikanth: ఇంటికి చేరిన సూపర్‌స్టార్‌.. దిష్టితీసి స్వాగతం పలికిన లతా రజినీకాంత్ - Watch Video
Rajini
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 01, 2021 | 4:43 PM

ఇటీవలే ఆసుపత్రిలో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న రజినీకాంత్ మూడు రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు. సూపర్‌స్టార్‌కు ఆయన భార్య లత హారతులతో స్వాగతం పలికారు. ఆయన తన కుమార్తె సౌందర్యతో కలిసి కారులో ఇంటికి చేరుకున్నారు. కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ ప్రక్రియలో భాగంగా రజినీకాంత్ మూడు రోజుల పాటు కావేరి ఆసుపత్రిలో చేరారు. మొదట్లో ఇది రెగ్యులర్ చెకప్ అని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నప్పటికీ, తరువాత ఆసుపత్రి బృందం రజినీకాంత్‎ను ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన గుండె శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది. రజినీకాంత్ తను ఇంట్లో ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్‎లో పోస్ట్ చేశాడు. “రిటర్న్ హోమ్” అని క్యాప్షన్‌ పెట్టారు.

రజినీకాంత్ తన కుమార్తె ఇటీవల ప్రారంభించిన వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్ ద్వారా తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. “చికిత్స ముగిసింది, నేను బాగానే ఉన్నాను. నేను ఈ రాత్రి ఇంటికి తిరిగి వచ్చాను. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ, నా ఆరోగ్యం గురించి అడిగిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని ఆయన అన్నారు. కొద్ది రోజుల క్రితం రజినీకాంత్ భారతీయ సినిమాకు చేసిన విశేష కృషికి గాను న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. త్వరలో రజనీకాంత్ నటించిన చిత్రం అన్నాత్తే 2021 దీపావళికి పెద్ద విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే తన మనవడు యాత్ర లింగ చిత్రాన్ని చూశారు. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది.

Read Also.. Jr.NTR: జిమ్‏లో ఎన్టీఆర్ చేసే కసరత్తులు చూస్తే షాకవ్వాల్సిందే.. వీడియో వైరల్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?