Viral Video: ఫేమస్ బ్యూటీషియన్‌లు కూడా పనికిరారు.. ఈ కోతి పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Viral Video: కోతులను మానవుల పూర్వీకులు అని అంటుంటారు. కోతి పరిణామ దశలో మానవుడు ఉద్భవించాడని అనేక శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి.

Viral Video: ఫేమస్ బ్యూటీషియన్‌లు కూడా పనికిరారు.. ఈ కోతి పని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Monkey
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 01, 2021 | 4:10 PM

Viral Video: కోతులను మానవుల పూర్వీకులు అని అంటుంటారు. కోతి పరిణామ దశలో మానవుడు ఉద్భవించాడని అనేక శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. అందుకే కోతి రూపం, మనిషి రూపం ఇంచుమించు అలాగే ఉంటుంది. పోలికలే కాదు.. ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కోతులు కూడా అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తుంటాయి. మనుషులు తిన్నట్లే తినడం, శుభ్రంగా ఉండటం, స్నానం చేయడం, మొహాన్ని అద్దంలో చూసుకోవడం, డ్రెస్ వేసుకోవడం వంటి చర్యలు కోతులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా కోతికి సంబంధించి అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను చూస్తే నవ్వుకోవడంతో పాటు.. కోతులకు, మనుషులకు సారూప్యత చాలా దగ్గరగా ఉందని అనిపించడం ఖాయం.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో రెండు కోతులు కూర్చున్నాయి. ఓ కోతి తన సహచర కోతి కళ్లను ఆకులతో తుడుస్తోంది. కోతి కనుబొమ్మలను ఆకులతో క్లీన్ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాకు ఈ జంట కోతుల చర్యలు చిక్కాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘పండుగ సీజన్ కావడంతో ఐబ్రో షేపింగ్ చేసుకుంటున్న కోతులు’’ అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోతులను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈ కోతి బ్యూటీషియన్‌ను కూడా మించిపోయిందని అంటున్నారు. మనుషులకంటే కూడా తెలివైన, నైపుణ్యం కలిగిన కోతి అని కామెంట్స్ పెడుతున్నారు. ఆ కోతి సెలూన్ పెట్టుకున్నా హాయిగా బ్రతికేయగలదు అంటూ నెటిజన్లు ఫన్నీగా రెస్పాండ్ అవుతున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటి వరకు 39 వేల మందికిపైగా వీక్షించారు. మరెందుకు ఆలస్యం.. ఈ టాలెంటెడ్ మంకీని మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Viral Video: పెళ్లిలో కోపంతో ఊగిపోయిన వధువు.. పెళ్లికూతురు చేసిన పనికి వరుడు షాక్..

Viral Video: సింహంతో పరాచకాలు ఆడితే.. రియాక్షన్ ఇలానే ఉంటుంది.. జస్ట్ మిస్

Viral Video: ఈ జంతువులను చూసి మనుషులు సిగ్గుపడాల్సిందే.. ఎందుకో మీరే చూడండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు