Viral Video: ఈ జంతువులను చూసి మనుషులు సిగ్గుపడాల్సిందే.. ఎందుకో మీరే చూడండి..

మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు.

Viral Video: ఈ జంతువులను చూసి మనుషులు సిగ్గుపడాల్సిందే.. ఎందుకో మీరే చూడండి..
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 01, 2021 | 12:40 PM

Viral Video: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. ముగా జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు తాజాగా ఇక్కడ ఓ వీడియోలో కూడా ఓ వ్యక్తి ముగా జీవి పై దాడి చేశాడు. అమానుషంగా ప్రవర్తించాడు. ఓ కుక్కను భాదించాడు. ఓ కుక్క చెవులు పట్టుకొని లాగుతూ.. పైకి లేపుతూ పిచ్చి చేష్టలు చేశాడు. పాపం నొప్పితో అక్కకు విలవిలలాడింది. అయినా కనికరం చూపకుండా దానిని ఇంకా బాధించాడు. అయితే మనుషులమైన మనలో మానవత్వం లేకపోయినా జంతువులు అలా కాదు తమ తోటి జీవాల పై ప్రేమను చూపుతాయి. ఆ కుక్క నొప్పితో ఆర్తనాదాలు చేస్తుంటే అది విన్న ఓ ఆవు అక్కడికి వచ్చి ఆ వ్యక్తి పై దాడి చేసింది.

దాని కొమ్ములతో ఆ వ్యక్తి పై దాడి చేసి ఆ కుక్కను కాపాడింది.  వ్యక్తిని తన కొమ్ములతో కుమ్మేసింది ఆ ఆవు. ఆవును చూసి భయపడిన ఆ వ్యక్తి కుక్కను వదిలేశాడు. ఆ తర్వాత అతడిని కింద పడేసి అతడిని కొమ్ములతో కుమ్మింది . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన తోటి జంతువును కాపాడుకోవడం కోసం ఆ ఆవు చేసిన పనికి నెట్టింట జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ ఆవుని చూసి మనం చాలా నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. పక్క మనిషి చనిపోతున్నా పట్టించుకోని ఈ సమాజం ఆ ఆవుని చూసి సిగ్గుపడాలి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Best Photos: అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ఫోటోగ్రాఫర్‌గా నాగర్ కర్నూల్ వాసి ఎంపిక.. ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..

Unstoppable With NBK: అనిపించింది అందాం.. అనుకుంది చేద్దాం.. ఎవడాపుతాడో చూద్దాం.. దుమ్ములేపిన బాలయ్య..(ట్రేండింగ్ ఫొటోస్)

Viral News: మెట్రో ప్రయాణికులను ముప్పు తిప్పలు పెట్టిన కోతులు.. అదిరిపోయే ఐడియాతో చెక్‌ పెట్టిన అధికారులు..