Gutta Suman: గుత్తా సుమన్ నేర చరిత్ర.. బెజవాడ మామిడి తోటల నుంచి కొలంబో కాసినోల దాకా

గుత్తా సుమన్‌ కుమార్‌ క్రైమ్‌ కథా చిత్రమ్‌లో తవ్వేకొద్దీ నేరాల డేటా బయటకు వస్తోంది. ప్రముఖుల లింకులు తెరపైకి వస్తున్నాయి. బెజవాడ మామిడి తోటల్లో పేకాట క్లబ్స్‌తో మొదలైన గుత్తా సుమన్‌ కుమార్‌ జర్నీ కొలంబో కాసినోల వరకు పాపులర్ అయ్యాడు.

Gutta Suman: గుత్తా సుమన్ నేర చరిత్ర.. బెజవాడ మామిడి తోటల నుంచి కొలంబో కాసినోల దాకా
Gutta Suman Kumar
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 02, 2021 | 8:37 AM

గుత్తా సుమన్‌ కుమార్‌ బిల్డప్‌.. హై ఫై గురించి విన్నామే తప్పితే.. అది ఎలా ఉంటుందో మాత్రం విజువల్స్‌ చూడలేదు. జిగేల్‌ జిగేల్‌ మనే లైట్స్‌.. అదిరిపోయే సౌండ్‌ సిస్టమ్‌.. గువ్వలు గుబేల్‌ మనే విధంగా ఉండే సౌండ్‌ బీట్స్‌.. ఇదంతా దర్జాగా సాగుతున్న యవ్వారమే. ఎంతలా అంటే.. ప్రత్యేకంగా ఒక ఇన్విటేషన్‌ కార్డు కూడా పెట్టి ప్రచారం చేసుకుంటున్నాడు క్యాసినో కింగ్‌. అందులోనూ డిసెంబర్‌ 31 నైట్‌ మాదిరిగా రేట్‌ కార్డును కూడా గ్రాఫిక్స్‌ చేయించి మరి బిజినెస్‌ చేస్తున్నాడు. గుత్తా సుమన్‌.. చూడ్డానికి టిప్‌టాప్‌గా, అమాయకుడిలా, బుద్ధిమంతుడిలా కనిపిస్తాడు. కానీ వీడు మామూలోడు కాదు, మహా మాయగాడు. సెటిల్‌మెంట్లు, బెదిరింపుల్లో ఆరితేరిన యమ ఖతర్నాక్. తెలుగు రాష్ట్రాల్లోని వీఐపీల నెంబర్లన్నీ సుమన్‌ ఫోన్లో ఉన్నాయంటే వీడు ఎంత మాయగాడో అర్ధం చేసుకోవచ్చు.

గుత్తా సుమన్ చేయని దందా అంటూ ఏమీలేదు. ఎప్పుడూ ఇద్దరు గన్‌మెన్లను తన పక్కన పెట్టుకుని బిల్డప్ ఇచ్చే సుమన్ మాటల గారడీ చేయడంలో దిట్ట. తన మాయ మాటలతో ఎంతటి వాళ్లనైనా ఈజీగా బుట్టలో వేసుకుంటాడు ఈ మాయగాడు. తాండూరులో 55 ఎకరాలు మోసం చేసిన బాధితుల్లో ఓ డాక్టర్‌, పోలీస్‌ అధికారి కూడా ఉన్నారు. అలాగే గుంటూరులోనూ గుత్తా సుమన్‌పై పలు కేసులు ఉన్నాయి. అమెరికాలో ఉన్న పలువురు ఎన్నారైలు కూడా సుమన్ వలలో పడ్డారు. జీఎస్కేప్‌, సత్యసాయి హోమ్స్‌ పేరిట రియల్టర్ అవతారమెత్తి మోసాలకు పాల్పడ్డాడు. కియా కార్ల డీలర్‌షిప్‌ పేరుతో కోట్ల రూపాయలు ముంచేశాడు. రెస్టారెంట్లలోనూ పేకాట క్లబ్స్‌ నడిపిన సుమన్… నిడమానూరు దగ్గర డ్రైవ్‌-ఇన్‌ రెస్టారెంట్‌ పేరుతో క్యాసినోలు నిర్వహించేవాడు. ఎడ్ల పందాల పేరుతోనూ గుత్తా సుమన్ దందాలు చేసేవాడు. న్యూస్ ఛానెల్‌ ఓనర్ పేరుతో పలువురిని బెదిరించిన చరిత్ర గుత్తా సుమన్‌ది.

సినీ ఫైనాన్షియర్‌గానూ బిల్డప్ ఇచ్చే గుత్తా సుమన్… కొలంబోలో క్యాసినోలకు బ్రోకర్‌గా ఉన్నాడు. క్యాసినోల కోసం పలువురిని కొలంబో కూడా తీసుకెళ్లాడు. ఓ భూకబ్జా కేసులో ఇటీవలే విజయవాడ నుంచి పరారైన గుత్తా సుమన్.. హైదరాబాద్‌లో తేలాడు. ఇక్కడికొచ్చాక ఊరికే ఏం లేడు. నగర శివార్లను తన అడ్డాలుగా మార్చుకుని క్యాసినో నిర్వహిస్తూ టీవీ9-ఎస్వోటీ జాయింట్ ఆపరేషన్‌లో బుక్కైపోయాడు.

Also Read: Diwali: ఏఏ రాష్ట్రాలు క్రాకర్స్ వినియోగానికి అనుమతి ఇచ్చాయి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి..?