Diwali: ఏఏ రాష్ట్రాలు క్రాకర్స్ వినియోగానికి అనుమతి ఇచ్చాయి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి..?

దేశ వ్యాప్తంగా దీపావళి కోలాహలం మొదలైంది. పండుగకు సొంతూరి బాట పట్టే వారు కొందరైతే, పండుగ షాపింగ్‌లో మునిగి తేలుతున్న వారు ఇంకొందరు. ఇంతకీ పండుగకు క్రాకర్స్ పేల్చవచ్చా? రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తాయా? సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయి? 

Diwali: ఏఏ రాష్ట్రాలు క్రాకర్స్ వినియోగానికి అనుమతి ఇచ్చాయి.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయి..?
Diwali Crackers
Follow us

|

Updated on: Nov 02, 2021 | 7:39 AM

దీపావళి అంటే కొత్త బట్టలు.. పండి వంటలు.. కొత్త అల్లుళ్ల అగమనాలు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టపాసుల సందడి మరో ఎత్తు. క్రాకర్స్‌ లేని దివాళిని ఊహించలేము. అయితే మితిమీరిన టపాసుల కాల్చివేత ప్రమాదకరంగా మారుతుంది. మనల్ని ప్రమాదంలో పడేస్తోంది. కోవిడ్ ఎంటర్ అయ్యాక మానవ ఆరోగ్యం డేంజర్‌లో పడింది. ఈ క్రమంలో ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బాణసంచా కాల్చివేతపై నిషేధం విధించక తప్పడం లేదు.

గ్రీన్‌క్రాకర్స్‌ మాత్రమే వాడాలన్నది కోర్టు సలహా. అతి తక్కువ హానికర రసాయనాలతో తయారుచేసే బాణసంచాను గ్రీన్‌ క్రాకర్స్ అంటారు. వాటినే ఇప్పుడు దేశమంతా వినియోగించాలి. సాధారణ క్రాకర్స్‌లో బేరియం నైట్రేట్ ఉపయోగిస్తారు. ఇది అత్యంత హానికరమైన పదార్థం. సాధారణ క్రాకర్స్‌తో పోల్చితే గ్రీన్‌ క్రాకర్స్ 35 శాతం తక్కువ కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. దివాళి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఆంక్షలు వివిధ రకాలుగా ఉన్నాయి.

ఢిల్లీ

దివాళికి బాణసంచా పేల్చవద్దంటోంది ఢిల్లీ ప్రభుత్వం. క్రాకర్స్ కాల్చితే.. భారీ జరిమానా తప్పదంటోంది. టపాసులు విక్రయించేందుకు ఎవరికి అనుమతి లేదంటూ ఏకంగా లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసింది. ఇప్పటికే పంటల వృధా కాల్చివేతతో కాలుష్యం పెరుగుతోంది. మరో వైపు వాహనాలతో వచ్చే కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు టపాసులకు అనుమతి ఇవ్వడమంటే.. ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అంటోంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే టపాసుల వాడకంపై బ్యాన్ విధించింది. క్రాకర్స్ కాల్చివేత వృద్ధులు, చిన్నారులకు ప్రమాదమని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. 2022 జనవరి ఒకటి వరకు ఢిల్లీలో సేల్స్ అండ్ వాడకంపై బ్యాన్ విధించింది.

కర్నాటక

కర్నాటక మాత్రం గ్రీన్‌ క్రాకర్స్ కాల్చుకోవచ్చని అంటోంది. సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్ పాటిస్తూ.. అనుమతి ఉన్న దుకాణదారులే గ్రీన్‌ క్రాకర్స్ విక్రయించాలని చెప్తోంది. మహారాష్ట్రలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో క్రాకర్స్ కాల్చవద్దంటోంది రాష్ట్ర ప్రభుత్వం.

పంజాబ్

పంజాబ్ మాత్రం గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవడానికి కేవలం రెండు గంటల సమయం ఇచ్చింది. సాధారణ టపాసుల తయారీ, అమ్మకాన్ని నిషేధించింది.

ఉత్తర ప్రదేశ్

ఉత్తర ప్రదేశ్ టపాసులు పేల్చడాన్ని కంప్లీట్‌గా నిషేధించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యుల్ రూల్స్ అమలయ్యేలా చూడాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాత్రి 8 నుంచి 10 గంటల వరకు టపాసుల కాల్చివేతకు అనుమతించింది.

తమిళనాడు

బేరియం లవణాలు కలిగిన టపాసుల వినియోగాన్ని నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్ తప్పదని తమిళనాడు హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్

గ్రీన్‌ క్రాకర్స్ మాత్రమే వాడాలంటోంది ఏపీ ప్రభుత్వం. అది కూడా రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అంటూ నిబంధన విధించింది. థర్డ్‌వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని టపాసులకు బదులు.. గ్రీన్‌ క్రాకర్స్ కాల్చాలని ప్రభుత్వం చెప్తోంది.

తెలంగాణ

హైదరాబాద్‌లో దీపావళి టపాసులపై ఆంక్షలు విధించారు. శబ్ద కాలుష్యం కలిగించే టపాసుల విక్రయంపై నిషేధం విధిస్తున్నాం, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మార్గదర్శకాలు అమలుచేస్తామని GHMC కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ప్రకటించారు.

హర్యానా

హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని 14 జిల్లాల్లో అన్ని రకాల క్రాకర్స్ అమ్మకం, వినియోగంపై నిషేధం విధించింది  ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భివానీ, చర్కీ దాద్రీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఝజ్జర్, జింద్, కర్నాల్, మహేందర్‌గఢ్, నుహ్, పాల్వాల్, పానిపట్, రెవారీ, రోహ్‌తక్, సోనిపట్ జిల్లాల్లో నిషేధం విధించారు.

Also Read:  Samantha: కొన్నిసార్లు కలపడం కంటే.. అలా వదిలేయడమే ముఖ్యం. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో