Samantha: కొన్నిసార్లు కలపడం కంటే.. అలా వదిలేయడమే ముఖ్యం. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత..

Samantha: నాగచైతన్యతో విడాకుల వ్యవహారం అనంతరం సమంతకు సంబంధించిన వార్తలు నెట్టింట బాగా వస్తున్నాయి. పరువు నష్టం దావా కేసు నుంచి మొదలు, సోషల్ మీడియాలో పోస్టుల వరకు సమంత ఏదో ఒక టాపిక్‌తో..

Samantha: కొన్నిసార్లు కలపడం కంటే.. అలా వదిలేయడమే ముఖ్యం. ఆసక్తికరమైన పోస్ట్ చేసిన సమంత..
Samantha
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 02, 2021 | 7:05 AM

Samantha: నాగచైతన్యతో విడాకుల వ్యవహారం అనంతరం సమంతకు సంబంధించిన వార్తలు నెట్టింట బాగా వస్తున్నాయి. పరువు నష్టం దావా కేసు నుంచి మొదలు, సోషల్ మీడియాలో పోస్టుల వరకు సమంత ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా సమంత సోషల్‌ మీడియా వేదికగా చేస్తోన్న పోస్టులు కొన్ని ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉంటే సమంత ఇటీవల ఛార్‌దామ్‌ యాత్రను ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చిందరవందరగా పడి ఉన్న తన దుస్తులను సర్దుకునే పనిలో పడ్డారు సమంత.

ఇందులో భాగంగానే ఆర్గనైజ్‌ విత్ ఈజ్‌ అనే ఓ సంస్థతో కలిసి తన ఇంటిని చక్కదిద్దుకున్నారు ఈ క్రమంలో ఆర్గనైజర్‌తో కలిసి మాట్లాడుతూ తీసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు సమంత. ఈ సమయంలో సమంత తన జీవనవిధానానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎప్పుడైనా ఒత్తిడికి గురైనా, మూడ్‌ బాగా లేకపోయినా దాని నుంచి బయట పడేందుకు కబోర్డ్‌లోని దుస్తులను తీసి మళ్లీ సర్దుకుంటానని చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే తన డ్రెస్సింగ్ రూంకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు సమంత.

బెడ్‌పై కుప్పలుకుప్పలుగా పడి ఉన్న దుస్తులను చూపించిన సమంత.. ‘కొన్నిసార్లు సర్దుకోవడం, కలపడం కంటే వాటిని అలా వదిలివేయడమే ముఖ్యం’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే విడాకుల తర్వాత వరుస ప్రాజెక్టులకు ఓకే చెబుతూ మళ్లీ కెరీర్‌లో బిజీ కావాలని భావిస్తోన్న సమంత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు బాలీవుడ్‌ చిత్రాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తున్నారు సామ్‌.

Also Read: Vijayawada Tdp: బెజవాడ టీడీపీలో పదవుల చిచ్చు.. అలసు గోలంతటికి కారణం అదేనా..?

Winter Health Tips: వచ్చేది చలికాలం.. మరి ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసా..

Huzurabad By Election Results: హుజూరాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. మధ్యాహ్నం 3 గంటల్లోగా తుది ఫలితం..