Vijayawada Tdp: బెజవాడ టీడీపీలో పదవుల చిచ్చు.. అలసు గోలంతటికి కారణం అదేనా..?
Vijayawada Tdp: బెజవాడ టీడీపీ లో కమిటి చిచ్చు రేపుతోంది. నేతల వర్గపోరుతో పార్టీ కమిటీ ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. ఇపుడు ప్రకటించిన కమిటీలో బెజవాడ నేతలకు ప్రాధాన్యం
Vijayawada Tdp: బెజవాడ టీడీపీ లో కమిటి చిచ్చు రేపుతోంది. నేతల వర్గపోరుతో పార్టీ కమిటీ ప్రకటన వాయిదా పడుతూ వస్తోంది. ఇపుడు ప్రకటించిన కమిటీలో బెజవాడ నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమలో ఎంపీ నాని జోక్యం చేసుకోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెజవాడ టీడీపీ లో వర్గపోరు సమసి పోలేదు. కార్పొరేషన్ ఎన్నికల్లో బహిర్గతం అయిన నేతల మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, ఎంపీ కేశినేని నాని మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, ప్రచారంలో తారాస్థాయికి చేరాయి. ఈ ముగ్గురు నేతలు.. చంద్రబాబు ప్రచారంలో కేశినేని నాని పాల్గొంటే తాము రామని తేల్చిచెప్పారట. దీంతో నాని లేకుండానే చంద్రబాబు ప్రచారం జరిగింది. ఆ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓటమి పాలైంది.
అయితే, తాజాగా విజయవాడ పార్లమెంట్ కమిటీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నెట్టెం రఘురాం ను చంద్రబాబు నియమించారు. నేతల మధ్య విభేదాలతో కమిటి ప్రకటించ కుండా ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు కమిటి ప్రకటించారు. అయితే, ప్రధాన కార్యదర్శి పదవిపై పోటీ నెలకొంది. పతావుల్లా కు ఇవ్వాలని ఎంపీ నాని పట్టుబట్టగా.. ఎరుబోతు రమణారావు కు ఇవ్వాలని బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా పట్టుబట్టారు. చివరికి వీరెవరికీ కాకుండా.. తిరువూరుకు చెందిన మునెయ్య ను నియమించారు. పతావుల్లా ను మైనార్టీ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా నియమించారు. బెజవాడ టీడీపీ నేతల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరడానికి ప్రధాన కార్యదర్శి పదవే కారణం. ఆ పదవిని ఇప్పుడు తిరువూరు నేతకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, బెజవాడ పార్లమెంట్ టీడీపీ కమిటీ ప్రకటన.. అసంతృప్తి జ్వాల రగిలిస్తోంది. విజయవాడ పార్లమెంట్ కమిటీలో ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ ఏర్పడింది. దీంతో కమిటీ ప్రకటన నెలల తరబడి వాయిదా పడుతూ వచ్చింది. ఎంపీ నాని తన అనుచరుడు పథావుల్లా కు ఇవ్వాలని పట్టుబట్టారు. బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లు మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు కు ఇవ్వాలని అధిష్టానానికి సిపార్సు చేశారు. ఈ పదవి విషయంలోనే.. నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. చివరికి మొన్న ప్రకటించిన కమిటీలో ఇరువర్గాలు సూచించిన నేతలకు ఇవ్వకుండా తిరువూరు నేతకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. దీనిపై ఎరుబోతు రమణా రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకున్న తనకు ఈ పదవి ఇవ్వకపోవడం బాధాకరమని, పార్టీ కార్యాలయాలు దాటని, నేతల దగ్గర గుమస్తాలుగా పనిచేసే వారికి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ టీడీపీ లో ప్రధాన కార్యదర్శి పదవికి అర్హులే లేరా? అని ఇన్ డైరెక్టుగా ఎంపీ నానిపై విమర్శలు చేశారు. తనకు కేటాయించిన అధికార ప్రతినిధి పదవి తీసుకోనని.. పార్టీ లోనే కొనసాగుతానని రమణారావు తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గానికి ఎనిమిది పదవులు వస్తే.. బుద్దా వెంకన్న, నాగుల్ మీరా వర్గానికి నాలుగు పదవులు, ఎంపీ నాని వర్గానికి నాలుగు పదవులు వచ్చాయి. తమ నియోజకవర్గాల్లో ఎంపీ నాని జోక్యం చేసుకోవడాన్ని ఈ ముగ్గురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమ అభిప్రాయాలను పట్టించుకోకుండా.. పార్టీలో కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఈ ముగ్గురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేక వీరు తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తీరు ఇలాగే కొనసాగితే కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి బెజవాడ టీడీపీ భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also read:
Pawan Kalyan: గంజాయి స్మగ్లింగ్.. ఏపీ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..
Badvel By Election: బద్వేల్ బాద్‌షా ఎవరు?.. మరికొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..
Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!