క్రైమ్ సినిమాను తలదన్నేలా కర్నూలు జిల్లాలో ఘటన.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా..
క్రైమ్ సినిమాను తలదన్నేలా కర్నూలు జిల్లాలో సంఘటన జరిగింది. అత్యంత విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావాల్సిన యువతి.. ప్రేమికుడితో లేచిపోతూ బైక్ పై..
క్రైమ్ సినిమాను తలదన్నేలా కర్నూలు జిల్లాలో సంఘటన జరిగింది. అత్యంత విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కావాల్సిన యువతి.. ప్రేమికుడితో లేచిపోతూ బైక్ పై నుంచి కింద పడి మృతి చెందిన సంఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లికి చెందిన అరుణ, ప్రకాశం జిల్లా మార్కాపురం లోని లక్ష్మీ నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు ఫ్రెండ్స్. బీటెక్ చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2 రోజుల క్రితం స్వగ్రామానికి చెందిన తన మేనమామ కొడుకుతో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈనెల 20న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కోసం సోమవారం ఉదయం పేరెంట్స్ బంధువులు అందరూ కలిసి బంగారం కొనేందుకు కర్నూలు వెళ్లారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు మార్కాపురం నుంచి బైక్‌పై బొమ్మిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చారు.
తన ప్రేమికురాలు అరుణను బైక్‌పై తీసుకెళ్ళాడు. బేతంచెర్ల మండలం యంబాయి గ్రామం దగ్గర బైక్ మీద నుంచి అరుణ కింద పడింది. తలకు గాయం కావవడంతో అరుణ సమీప హుసేనాపురం ప్రాథమిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతి చెందిన అరుణ మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లాడు వెంకటేశ్వర్లు. వద్దని ఆసుపత్రి సిబ్బంది వారించ్చినప్పటికీ వినలేదు. మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తుండగా పాణ్యం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్వర్లును వెల్దుర్తి పోలీసులకు పాణ్యం పోలీసులు అప్పగించారు.. అరుణ ప్రమాదంలో చనిపోలేదని, వెంకటేశ్వర్లు హత్య చేశాడని అరుణ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇష్టం లేకపోతే నవ్వుతూ ఎంగేజ్మెంట్ ఎలా చేసుకుందని, మేనమామ కొడుకుతోనే నిశ్చితార్థం అయ్యిందని, ఇది ముమ్మాటికీ హత్యే అని ఆరోపిస్తున్నారు అయితే అరుణది హత్యనా.. లేక ప్రమాదమా అని తేలాల్సి ఉంది. డోన్ డీఎస్పీ శ్రీనివాస్ ఇ నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.
ఇవి కూడా చదవండి: