Love Problems: భర్తను వీడి రానన్న భార్య.. ఆగ్రహంతో గ్రామ పెద్దలు ఏం తీర్పు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..!

Love Problems: ప్రేమించడమే ఆ జంట చేసిన నేరమా.. ఒకరినొకరు విడిచి ఉండలేక పెళ్లి చేసుకోవడమే వారు చేసిన పాపమా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారో తెలియదు కానీ..

Love Problems: భర్తను వీడి రానన్న భార్య.. ఆగ్రహంతో గ్రామ పెద్దలు ఏం తీర్పు ఇచ్చారో తెలిస్తే షాక్ అవుతారు..!
Cop Panchayat
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 01, 2021 | 7:39 PM

Love Problems: ప్రేమించడమే ఆ జంట చేసిన నేరమా.. ఒకరినొకరు విడిచి ఉండలేక పెళ్లి చేసుకోవడమే వారు చేసిన పాపమా.. ఇంకా ఏ కాలంలో ఉన్నారో తెలియదు కానీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పెద్ద పనిష్మెంటే ఇచ్చారు. ఓకే సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా.. ప్రేమ పెళ్లి చేసుకున్న అబ్బాయితో పాటు అతడి కుటుంబానికి పెద్ద శిక్షే వేశారు గ్రామ పెద్దలు. ఆ జంటను విడదీసి.. అబ్బాయి కుటుంబాన్ని ఊరి నుంచి వెలివేశారు. ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరని తెలిసి.. ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్న ఆ జంటకు న్యాయం చేయాల్సిన పంచాయితీ పెద్దలు.. ఇలా పెదరాయుడి తీర్పుతో గ్రామం నుండి వెలి వేయడం ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామానికి చెందిన తడకమళ్ల పర్వతరావు చిన్న కుమారుడు ప్రమోద్ పదో తరగతి వరకు చదివి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. కొంత కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్తే.. ఒప్పుకోరని భావించిన ఈ ప్రేమ జంట.. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 25న ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెంలో పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు రక్షణ కావాలని, అమ్మాయి బంధువుల నుండి ప్రాణ హాని వుందని కోరుతూ ఎర్రుపాలెం పోలీసులను ఆశ్రయించారు. అయితే, తెలివిగా ఆలోచించిన వధులు తల్లిదండ్రులు.. తమ ఇంట్లోని బంగారం పోయిందంటూ అబ్బయిపై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

కట్ చేస్తే గొడవ.. గ్రామంలోని కుల పెద్దల దృష్టికి వచ్చింది. ఇరువర్గాలను పిలిచి కులపెద్దల సమక్షంలో పంచాయితీ కూడా ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న కులపెద్దలు అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పమని ప్రమోద్ కుటుంబానికి సూచించారు. అయితే.. ఆ యువతి మాత్రం తాను ప్రేమించిన ప్రమోద్​తోనే వెళ్తానని తెగేసి చెప్పేసింది. ఎంత చెప్పినా వినకపోవటంతో కులపెద్దలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. యువకుడి కుటుంబాన్ని ఊరి నుంచి వెళివేస్తున్నట్లు కులపెద్దలు తీర్పు చెప్పారు. గ్రామస్తులు ఎవరు కూడా వారితో మాట్లాడొద్దని.. మాట్లాడిన వారికి రూ.10 వేలు జరిమానా విధిస్తామని హుకూం జారీ చేశారు.

ఇదిలాఉంటే.. తమ కుమార్తెను పంపించాలని రాత్రి సమయంలో ప్రమోద్ ఇంటికి అమ్మాయి తరఫు బంధువులు వెళ్లి హడావిడి చేశారు. కోపోద్రిక్తులైన అమ్మాయి తరఫు బంధువులు.. ప్రమోద్​తల్లిదండ్రులపై దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడి తండ్రి, తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులిద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పెళ్లి చేసుకుంటే ఇంత అన్యాయమా? మామీద ఇంత దౌర్జన్యం చేస్తారా? అని బాధితులు వాపోయారు బాధితులే. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి.. అమ్మాయి తరఫు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

GST Collection: అక్టోబర్‎లో రికార్డుస్థాయిలో జీఎస్‎టీ వసూల్.. అమ్మకాలు పెరగడమే కారణామా..

Green Chillies: పచ్చిమిర్చి తింటే నాలుగు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. అవి ఏమిటంటే..

Raja Vikramarka Trailer: దీపావళిని గ్రాండ్‏గా ప్లాన్ చేసిన కార్తికేయ.. రాజా విక్రమార్క ట్రైలర్ ఎలా ఉందంటే..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?