AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Vikramarka Trailer: దీపావళిని గ్రాండ్‏గా ప్లాన్ చేసిన కార్తికేయ.. రాజా విక్రమార్క ట్రైలర్ ఎలా ఉందంటే..

ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత యంగ్ హీరో కార్తికేయ సూపర్ హిట్ కొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు..మొదటి సినిమాతోనే

Raja Vikramarka Trailer: దీపావళిని గ్రాండ్‏గా ప్లాన్ చేసిన కార్తికేయ.. రాజా విక్రమార్క ట్రైలర్ ఎలా ఉందంటే..
Raja Vikramarka
Rajitha Chanti
|

Updated on: Nov 01, 2021 | 7:17 PM

Share

ఆర్ఎక్స్ 100 మూవీ తర్వాత యంగ్ హీరో కార్తికేయ సూపర్ హిట్ కొట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు..మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్‏గా మారిన కార్తికేయ.. ఆ తర్వాత సరైన హిట్టు అందుకోలేదు. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. దీంతో తన తదుపరి చిత్రాలను ఎంచుకోవడంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రాజా విక్రమార్క. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇక ట్రైలర్ చూస్తే కార్తికేయ భద్రతా దశాల అధికారిగా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో సుధాకర్ కోమాకల కీలక పాత్రలో నటిస్తున్నాడు. హోమంత్రికి ముప్పు అంటే బాధ్యత నాది.. ప్రభుత్వాన్ని అలర్ట్ చేయాలి.. అంటూ సుధాకర్ కోమాకుల చెప్తున్న డైలాగ్స్ ఆసక్తిని కలిగించగా.. తనికెళ్ల భరణి.. కార్తికేయ మధ్య జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇందులో కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ట్రైలర్..

Also Read: Samantha: మూడ్ బాగలేకపోతే నేను చేసే పని అదే.. ఆసక్తికర విషయాలను వెల్లడించిన సమంత..

Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..

భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..