- Telugu News Photo Gallery Cinema photos Miss kerala 2019 ancy kabeer and runner up anjana shajan die in car accident today
భయంకరమైన రోడ్డు ప్రమాదం.. మాజీ మిస్ కేరళ, రన్నరప్ స్పాట్ డెడ్.. హృదయవిదారక దృశ్యాలు..
కేరళలలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ మృతి చెందారు.
Updated on: Nov 01, 2021 | 4:45 PM

కేరళలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2019 మిస్ కేరళ విజేత అన్సీ కబీర్, రన్నరప్ అంజనా షాజన్ కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

సోమవారం ఎర్నాకుళం బైపాస్‌లోని హాలిడే ఇన్ ముందు తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. స్పీడ్‌గా వెళ్తుండగా, మోటారు సైకిల్ అడ్డు రావడంతో.. దాన్ని తప్పించబోయి కారు ప్రమాదానికి గురైందని పోలీసులు తెలిపారు.

అన్సీ కబీర్.. తిరువనంతపురం అట్టింగల్‌లోని అలంకోడ్‌కు చెందినవారు. అంజనా షాజన్ స్వస్థలం త్రిసూర్.

ప్రమాదం జరగ్గానే తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే వీరిద్దరూ మృతిచెందారు.

కారులో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం క్షతగాత్రులకు ఎర్నాకులం మెడికల్ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. అన్సీ, అంజనా మృతదేహాలను మార్చురీకి తరలించారు.

ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‘ఇట్స్ టైమ్ టు గో’అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. మిస్ కేరళ 2019 కాంపిటీషన్ లో అన్సీ విజేతగా నిలవగా, అంజనా రన్నరప్‌గా నిలిచింది.





























