Suryakantam: హీరోయిన్ అవ్వాలనుకుని.. డ్యాన్సార్‌గా వెండి తెరపై అడుగు పెట్టి.. ఆంధ్రుల గుండమ్మత్తగా మారిన వైనం..

Suryakantam: ఇప్పటి తరానికి తెలియని.. ఆంధ్రుల అత్తగారు సూర్యకాంతం.. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని అద్భుతమైన సహజ నటి.. తెలుగువారి గుండమ్మత్త.. సూర్యకాంతం. ఎడమ చేతి విసురు.. చాతుర్యంతో కూడిన మాటలు.. అంతలోనే వెక్కిరింపు.. ఇంతలోనే పలకరింపు.. కల్లబొల్లి కబుర్లతో ఏడుస్తూ.. అత్త పాత్రలకు సజీవ శిల్పం సూర్యకాంతం..

Surya Kala

|

Updated on: Nov 01, 2021 | 2:55 PM

సూర్యకాంతం పేరు పెట్టడానికి అప్పట్లో తల్లిదండ్రులు వెనుకాడేవారు. ఎందుకంటే వెండి తెరపై ఆమె గయ్యాళి అత్త పాత్రలో అంతగా ఒదిగిపోయారు. ఇదే విషయంపై గుమ్మడి ఓ సరి మాట్లాడుతూ.. సూర్యకాంతం తెలుగుభాషకు చేసిన అన్యాయం ఒకటుంది. సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు" కొన్ని దశాబ్దాల పాటు అని అన్నారు. ఆంధ్రుల గయ్యాళి అత్తగా తెలుగు ఇండస్ట్రీలో సూర్యకాంతం పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

1 / 9
సూర్యకాంతం స్వస్థలం తూర్పుగోదావరిజిల్లాలోని కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణరాయపురం.1924 అక్టోబర్ 28న జన్మించారు. వారి తల్లిదండ్రులకు సూర్యకాంతం 14వ సంతానం. దీంతో ఇంట్లో ఎప్పుడు సందడి ఉండేది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సూర్యకాంతం ఆరేళ్ళ వయసులోనే పాడటం, డ్యాన్స్ నేర్చుకున్నారు. సినిమా పోస్టర్ చూసి.. సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు.

2 / 9
తన కుటుంబ సభ్యులకు సినిమాల్లో నటించడం ఇష్టంలేకేపోయినా నటికావాలనే కోరికతో చెన్నై చేరుకున్నారు. అయితే సినిమాల్లో నటించడానికి నువ్వు పనికి రావు అందంతో అసలే పట్టుదల కలిగిన సూర్యకాంతం.. మరింత పట్టుదలతో ఎలాగైనా నటి కావాలని నిర్ణయించుకున్నారు.

3 / 9
సూర్యకాంతం అవకాశాల కోసం అన్వేషిస్తున్న సమయంలో చంద్రలేఖ మూవీలో డ్యాన్సర్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు ఆమెని చూసి మేనేజర్ భూషణం డ్యాన్సర్ గా అవకాశం ఇప్పించారు. అలా వెండి తెరపై మొదటి అడుగు పెట్టారు సూర్యకాంతం.

4 / 9
సూర్యకాంతం తనకు డ్యాన్స్ రాదని చెప్పినా వినకుండా అవకాశం ఇవ్వడంతో చంద్రలేఖలో తొలిఅడుగు వేశారు సూర్యకాంతం. అనంతరం ధర్మాంగద మూవీలో మూగపాత్రలో నటించి అందరిని తన నటనలో ఆకట్టుకున్నారు. నారద నారది మూవీలో గుర్తించుకోదగిన పాత్ర దక్కింది. అయితే సంసారం సినిమాలో గయ్యాళి అత్తగా నటించి తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయింది.

5 / 9
అయితే హీరోయిన్ కావాలనుకున్న సూర్యకాంతం కు సౌదామిని  సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ దక్కింది. అయితే అప్పుడు ఆమెకు యాక్సిడెంట్ అవ్వడంతో అలా హీరోయిన్ అయ్యే అవకాశం మిస్ చేసుకున్నారు.

6 / 9
సహజ నటి సూర్యకాంతంకి పుస్తకాలంటే  చాలా ఇష్టం. ఏ మాత్రం సమయం దొరికినా పుస్తకాలను చదువుతూనే ఉండేవారు. ఆమె  బహుభాషాకోవిదురాలు, తన  50 ఏళ్ళ వయసులో  పట్టుబట్టి మరీ  జర్మన్  భాష  నేర్చుకున్నారు.  ఇక అప్పట్లో తెలుగు ధనం ఉట్టిపడేలా ఓ పుస్తకం కూడా రాశారు.

7 / 9
వెండి తెరపై గయ్యాళిగా నటించే సూర్యకాంతం నిజానికి చాలా సున్నితమైన మనసు కలవారు. తాను తినడమే కాదు.. తన తోటివారికి తానే స్వయంగా వండి కొసరి కొసరి వడ్డించేవారట. భోజనం విషయంలో  చిన్నా పెద్దఅనే బేధం లేకుండా కోటి విద్యలు కూటి కొరకే శుభ్రంగా   మొహమాటం లేకుండా తినమని పెట్టేవారట. అందుకనే ఆమె సెట్స్ మీద ఉన్నదంటే సహనటీనటులు సంతోషంగా ఉండేవారట.

8 / 9
 సంసారం గయ్యాళి అత్త రోల్‌లో నటించి.. తెలుగు వారికి గయ్యాళి అత్తగా పర్మనెంట్ గుర్తుండిపోయారు. సూర్యకాంతం దబాయింపూ, కచ్చితత్వమూ ఉన్న మనిషి.. తనకు రావాల్సినది కచ్చితంగా అడిగి మరీ వసూలు చేవారట. అయితే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి అవసరమైన వాళ్లకి ఆర్థికసహాయం చేయడానికి ఎప్పుడూ వెన్కడింది లేదట. అయితే అనవసరం అనిపిస్తే మాత్రం ‘పూచికపుల్ల’ కూడా విదిలించేవారు కాదట.. ఆంధ్రుల గుండమ్మత్త.. చివరి వరకూ నటిస్తూనే ఉండాలని అనికొరుకునేవారు.1996లో కన్నుమూశారు. అయినప్పటికీ సూర్యకాంతం తెలుగు ప్రేక్షకులకు తన నటద్వారా గుర్తిండి పోయారు..

9 / 9
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి