- Telugu News Photo Gallery Cinema photos Star heroin aishwarya rai rare and latest photos on the occasion of aishwarya rai birthday
Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ రేర్ ఫొటోస్, ఆసక్తికర విషయాలు మీ కోసమే
నవంబర్ 1న తన పుట్టిన రోజు సందర్భంగా ఐశ్వర్యరాయ్ గురించి ఆసక్తికర విషయాలు
Phani CH |
Updated on: Nov 01, 2021 | 5:48 PM

ఐష్ స్వస్థలం కర్ణాటకలోని మంగుళూరు. కుటుంబంలో అందరూ చదువుకున్నవారే కావడంతో ఆమెకు చిన్నప్పటి నుంచే వైద్యవృత్తిపై ఆసక్తి ఏర్పడింది.

కళాశాలలో ఉన్నప్పుడు మోడలింగ్‌పై మనసు మళ్లింది. అదే సమయంలో ఆమెకు ప్రకటనల్లో నటించే అవకాశం లభించింది.

1994లో ‘మిస్ వర్డల్’ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఆ తర్వాత ఐష్‌కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.

1997లో మణిరత్నం తెరకెక్కించిన ‘ఇరువర్’ (ఇద్దరు) సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

ఇప్పటి వరకు ఐష్ దాదాపు 50 సినిమాల్లో నటించింది.

2009లో ఐశ్వర్యరాయ్ ని భారత ప్రభుత్వం ‘పద్మ శ్రీ’ అవార్డుతో సత్కరించింది.

ఇవన్నీ కాక సినిమాల పరంగా లెక్కలేనన్ని నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు సాధించింది ఐశ్వర్యరాయ్.

నెదర్లాండ్స్‌లోని క్యూకెనోఫ్ గార్డెన్‌లో ఉన్న తులిప్ పువ్వుల్లోని ఒక ప్రత్యేక జాతికి ఐశ్వర్య రాయ్ పేరు పెట్టారు.

2007 ఏప్రిల్ 20న ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల వివాహం జరిగింది. వీరికి ఇప్పుడు ఆరాధ్య అనే కూతురు ఉంది.

నటిగా, బచ్చన్ కుటుంబానికి కోడలిగా, మంచి భార్యగా, తల్లిగా ఎప్పుడూ బాధ్యతలు మర్చిపోలేదు.

ఆమె 26 సంవత్సరాల మందు మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించినా.. ఇప్పటికీ గ్లామర్ ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా వెలిగిపోతోంది.





























