Green Chillies: పచ్చిమిర్చి తింటే నాలుగు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. అవి ఏమిటంటే..
Green Chillies Benefits: కొంతమంది తినే ఆహారం లో కారం ఘాటు ఎక్కువైనా తినలేరు.. మరికొందరు కారం తక్కువ ఉందని.. రుచిగా లేదని తినరు.. అయితే కొంతమంది..
Green Chillies Benefits: కొంతమంది తినే ఆహారం లో కారం ఘాటు ఎక్కువైనా తినలేరు.. మరికొందరు కారం తక్కువ ఉందని.. రుచిగా లేదని తినరు.. అయితే కొంతమంది పచ్చి మిర్చిని పచ్చిగా కూడా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా తెలుగువారు ఈ ఘాటైన మిరపకాయలతో కూరలలో ఉపయోగిస్తారు. అంతేకాదు మిరపకాయ బజ్జీలు, పచ్చి మిర్చి పులుసు, పచ్చడి వంటివి చేస్తారు. పచ్చి మిరపకాయలో విటమిన్ B6, విటమిన్ A, ఇనుము, కాపర్, పొటాషియంలతో పాటు కొద్ది మొత్తంలో ప్రోటీన్ , కార్బోహైడ్రేట్‌లు ఉన్నాయి. మిరపకాయ వేడి చేసే గుణం కలది. దీనిని పచ్చిగా, వేయించిన లేదా కాల్చిన రూపంలో తినవచ్చు. అంతేకాదు సలాడ్‌లో జత చేసుకోవచ్చు. భారతీయ వంటకాలలో పచ్చి మిర్చి ప్రధాన పాత్ర పోషిస్తుంది. పచ్చి మిరపకాయల్లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఈ విషయం అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ రోజు పచ్చి మిరపకాయతో కలిగే నాలుగు అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
చర్మ సంరక్షణ: పచ్చి మిరపకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీనిని తినడం వల్ల మీ చర్మం ఆరోగ్యంగా .. మెరుస్తూ ఉంటుంది.
జీర్ణక్రియకు సహాయకారి : పచ్చి మిరపకాయను తినడం వలన జీర్ణక్రియ ప్రక్రియలో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు పచ్చి మిర్చి నమిలే సమయంలో లాలాజలం అధికంగా విడుదల అవుతుంది. దీంతో తిన్న ఆహారం జీర్ణమవడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది: పచ్చి మిర్చి శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది దీంతో పచ్చి మిర్చి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
మధుమేహానికి మంచిది: మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా తమ ఆహారంలో పచ్చిమిర్చిని చేర్చుకోవాలి. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ను తగిన విధంగా ఉండేలా చూసుకుంటుంది. శరీరంలో చక్కర స్థాయి సమతుల్యతను ఉండేలా సహాయపడుతుంది.
Also Read: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో మొక్కను నాటి..తన స్నేహితుడు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టిన విశాల్..