Andhra Pradesh News: కర్నూలు జిల్లాలో యువతి అదృశ్యం.. పట్టించుకోని పోలీసులు.. అదేమంటే..
Andhra Pradesh News: కొందరు పోలీసు అధికారుల్లో నిర్లక్ష్యం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. కష్టాల్లో ఉన్నామని ఆదుకోమని ప్రజలొస్తే.. వారి నిర్లక్ష్య వైఖరితో మరింత నష్టం చేకూరుస్తున్నారు.
Andhra Pradesh News: కొందరు పోలీసు అధికారుల్లో నిర్లక్ష్యం రోజు రోజుకు పెచ్చుమీరుతోంది. కష్టాల్లో ఉన్నామని ఆదుకోమని ప్రజలొస్తే.. వారి నిర్లక్ష్య వైఖరితో మరింత నష్టం చేకూరుస్తున్నారు. బాధితులను మరింత బాధపెడుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిదిలోని రుద్రవంర మండలం ఆర్ నాగులవరం గ్రామానికి చెందిన యువతి అదృశ్యమైంది. అయితే యువతి కనిపించడం లేదని మూడు రోజుల క్రితం బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొక్కుబడిగా ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. ఆ తరువాత ఆ కేసును పట్టించుకోవడమే మానేశారు. ఫిర్యాదుపై సరిగా స్పందించడం లేదు. బిడ్డ అదృశ్యమై మూడు రోజులు గడుస్తు్న్నా.. పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ బిడ్డ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ రుద్రవరం పోలీస్ స్టేషన్ ముందు బైటాయించారు. తమ బిడ్డను ఎక్కడుందో కనిపెట్టాలని, పోలీసులు నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబీకులు. బాధితుల ఆందోళనతో వెంటనే రియాక్ట్ అయిన పోలీసులు.. అదృశ్యమైన యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఆమె ఆచూకీ కనిపెడతామని అన్నారు.
Also read:
Trs vs Bjp: బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడండి.. మంత్రి హరీష్ రావు మార్క్ కామెంట్స్..
సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్..! ఇప్పుడు కారులో కూర్చొని సినిమా చూడొచ్చు.. ఎక్కడంటే..?