సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు కారులో కూర్చొని సినిమా చూడొచ్చు.. ఎక్కడంటే..?

Open Air Theatre: ఇప్పుడు విదేశాల్లో లాగా భారతదేశంలో కూడా ఓపెన్ థియేటర్‌లో సినిమా చూడవచ్చు. రిలయన్స్ రూఫ్ టాప్ 'సినిమా హాల్'ని ప్రారంభించబోతోంది. దీని

సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు కారులో కూర్చొని సినిమా చూడొచ్చు.. ఎక్కడంటే..?
Open Theatre
Follow us
uppula Raju

|

Updated on: Nov 01, 2021 | 9:19 PM

Open Air Theatre: ఇప్పుడు విదేశాల్లో లాగా భారతదేశంలో కూడా ఓపెన్ థియేటర్‌లో సినిమా చూడవచ్చు. రిలయన్స్ రూఫ్ టాప్ ‘సినిమా హాల్’ని ప్రారంభించబోతోంది. దీని పేరు జియో డ్రైవ్-ఇన్ థియేటర్. ఇది పూర్తిగా ఓపెన్ ఎయిర్ థియేటర్. ప్రజలు బహిరంగ ప్రదేశంలో కూర్చుని సినిమాలు చూసి ఆనందించగలరు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ‘రూఫ్ టాప్, ఓపెన్ ఎయిర్ థియేటర్’ అవుతుంది. ముంబైలో ఈ ఓపెన్ థియేటర్‌ను ప్రారంభించనున్నారు.

కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తర్వాత సినిమా, థియేటర్ వ్యాపారం నష్టాలపాలైంది. ప్రస్తుతం కొన్ని థియేటర్లు తెరుచుకుంటున్నప్పటికీ అక్కడికి వెళ్లే వారికి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దీన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఓపెన్ ఎయిర్ థియేటర్ అనే కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు. ప్రపంచంలో ఇప్పటికే ఇటువంటి ప్రయోగాలు జరిగాయి కానీ దాని వ్యాపారం అంత ప్రభావవంతంగా లేదు. ఇప్పుడు కొవిడ్‌ వల్ల ఈ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వస్తోంది.

ఓపెన్ థియేటర్ ఎలా ఉంటుంది..? ఈ రకమైన థియేటర్ బహిరంగ ప్రదేశంలో ఉంటుంది. మనుషులు ఒకరికొకరు దూరంగా ఉంటారు. దీనివల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ప్రజలు తమ కారులో లేదా పెద్ద సినిమా స్క్రీన్ ముందు ప్రత్యేక ఛాంబర్‌లో కూర్చుని సినిమాని ఆస్వాదించవచ్చు. రిలయన్స్ ఇప్పుడు ఇలాంటి కొన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను నిర్మించబోతోంది. దీనికి జియో డ్రైవ్-ఇన్ థియేటర్ అని పేరు పెట్టారు.

బహిరంగ ప్రదేశంలో కూర్చుని సినిమాని ఆస్వాదించండి అలాంటి థియేటర్లలో పెద్ద ఔట్ డోర్ స్క్రీన్ ఉంటుంది. అందులో తమ సౌలభ్యం ప్రకారం కారులో ఉండి సినిమాని వీక్షించవచ్చు. వాయిస్ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఉపయోగిస్తారు. లేదా బాహ్య స్పీకర్లు ఇన్‌స్టాల్ చేస్తారు. అలాంటి థియేటర్లలో సామాజిక దూరాన్ని పాటిస్తూ సినిమా చూసి ఆనందించవచ్చు. విదేశాల్లో ఇలాంటి ఓపెన్ థియేటర్లు ఉండటం వల్ల జనాలు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.

TRS Telangana Vijaya Garjana: టీఆర్ఎస్ తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

Ducati: డుకాటి కంపెనీ బైక్‌ ఖరీదు రూ.10 లక్షలు.. ఫీచర్లు, స్పీడ్‌ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

Diwali 2021: తమలపాకుతో అదృష్టం.. వ్యాపారంలో అభివృద్ధి.. ఎలాగంటే..?