APPSC Recruitment: హార్టికల్చర్‌లో డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌డేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరసగా ఉద్యోగాల భర్తీ కోసం..

APPSC Recruitment: హార్టికల్చర్‌లో డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌డేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Appsc Horticulture Officer
Follow us

|

Updated on: Nov 01, 2021 | 9:32 PM

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజులుగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వరసగా ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తూ.. నోటిఫికేషన్ విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో హార్టికల్చర్ సర్వీస్ లో వివిధ ప్రాంతాల్లో పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. గత నెల 11నుంచి అప్లికేషన్ ను స్వీకరిస్తున్నారు. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే చివరి తేదీ.. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రేపు సాయంత్రంలోగా (నవంబర్ 2 )లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ నోటిఫికేషన్ లో 39 ఖాళీలను భర్తీ చేస్తుంది. అప్లై చేసుకోవాలనుకునేవారికి.. మరిన్ని వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి .. మీ కోసం

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఖాళీలు -39

జోనల్ వారీగా ఖాళీల వివరాలు:

జోన్ 1 లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉన్నాయి. ఈ జోన్ లో మొత్తం 5 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక జోన్ రెండు లో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాలు ఉన్నాయి. ఈ మూడు జిలాల్లో మొత్తం 13 పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇక జోనల్ మూడులో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జలాలు ఉన్నాయి. ఈ జిలాల్లో 11 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక జోనల్ నాలుగులో చిత్తూరు, కడప, కర్నూలు, అనంతరపురం జిల్లాలు ఉన్నాయి. రాయలసీమ పరిధిలోని ఈ జిలాల్లో మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల బీఎస్సీ లేదా బీఎస్సీ హానర్స్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులకు 2021 జూలై 1వ తేదీకి 18 నిండి ఉండాలి. గరిష్టం 42 ఏళ్లు మించరాదు. అయితే ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, దివ్యంగులకు 10 ఏళ్ళు సడలింపు ఉంది.

దరఖాస్తు ఫీజు- జనరల్ కేటగిరికి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీ: రూ.250 , పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బిసి, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ లకు దరఖాస్తు ఫీజులో మినహాయింపు ఉంది. అయితే వీరు పరీక్ష ఫీజు రూ.120 చెల్లించాల్సి ఉంది.

ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ని నిర్వహిస్తారు.

దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం …Horticulture Offier-28092021

దరఖాస్తు చేసుకోవడానికి ఈ లింక్ ని క్లిక్  చేయండి.. https://psc.ap.gov.in/

Also Read:  ధన్‌తేరాస్ వేళ బంగారం, వెండి వస్తువులను కొంటే శుభం.. ఇవి కొంటే మాత్రం కష్ఠాలు కొని తెచ్చుకున్నట్లే..

Latest Articles
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
12 రాశుల వారికి వార ఫలాలు (మే 19నుంచి మే 25, 2024 వరకు)
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?