- Telugu News Photo Gallery Spiritual photos Dhanteras 2021: Know date ,significance and more about this major Hindu festival
Dhanteras 2021: ధన్‌తేరాస్ వేళ బంగారం, వెండి వస్తువులను కొంటే శుభం.. ఇవి కొంటే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..
Dhanteras 2021: హిందూ కేలండర్ ప్రకారం కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశిని ధన తయోదశిగా జరుపుకుంటారు. ధన త్రయోదశి అంటే సంపదను, శ్రేయస్సుని ఇచ్చేదని అర్ధం. ఈ ఏడాది ధనత్రయోదశి నవంబర్ 2వ తేదీన వచ్చింది. ధనత్రయోదశి విశిష్టత ఏమిటి..? రేపు లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి.. తెలుసుకుందాం
Updated on: Nov 01, 2021 | 8:46 PM

ఉత్తర భారత దేశంలో దీపావళి పండగను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండగలోని మొదటి రోజు ధన త్రయోదశి. దీనినే ‘ధన్‌తేరాస్’ , ‘ధన త్రయోదశి’ ‘ఛోటీ దివాలీ’ అని వివిధ పేర్లతో పిలుస్తారు.

హిందూ సంప్రదాయంలో ఐశ్వర్య దేవత గా లక్ష్మీదేవిని భావిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో ధన త్రయోదశిరోజున లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి ఉద్భవించిందని..పురాణాల కథనం. అంతేకాదు.. ఇదేరోజున ధన్వంతరి బంగారు కలశంతో దర్శనమిచ్చాడని మరికొందరి నమ్మకం. అందుకనే ఈ రోజున లక్ష్మీదేవి తో పాటు ధన్వంతరి, కుబేరుడులను కూడా పూజిస్తారు.

ధన త్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్ధిక కష్టాలు ఉందని హిందువుల విశ్వాసం. అందుకనే ఇంటిని శుభ్రం చేసి.. సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం, ప్రాంగణం, ఇంటి దక్షిణం వైపు కచ్ఛితంగా దీపం వెలిగిస్తారు. అంతేకాదు ఈరోజున యమదీపాలను పెడతారు. ఇలా యమదీపం పెట్టిన ఇల్లు సుఖసంతోషాలు, సౌఖ్యాలు సంపదలతో నిండి ఉంటుందని విశ్వాసం.

ధన్ తేరాస్ రోజున సూర్యాస్తమయంలో అంటే సాయంత్రం లక్ష్మీదేవీని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ప్రదోషకాలంలో లక్ష్మీ పూజ నిపూజిస్తే.. అమ్మవారి ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని పెద్దలనమ్మకం.

ధనత్రయోదశిరోజున షాపింగ్ చేయడం శుభప్రదమని హిందువుల నమ్మకం. ముఖ్యంగా బంగారం, వెండి వస్తువులను కొనడానికి ఆసక్తిని చూపిస్తారు. అంతేకాదు మరికొందరు ఇంటిలో ఉపయోగించే వస్తువులు, కార్లు, మోటార్, భూమి వంటివాటిని కొనుగోలు చేస్తారు

అయితే ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే.. దారిద్య్రాన్ని మీరు ఆహ్వానిస్తున్నట్లే లెక్కఅట. ముఖ్యంగా నలుపు రంగు దుస్తులను ధరించరాదు. అంతేకాదు నలుపు రంగు వస్తువులు, గాజు, అల్యూమినియం, ఇనుముతో చేసిన వస్తువులను అస్సలు కొనకూడదు. వీటిల్లో ఏవి కొన్నా.. ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దల విశ్వాసం





























