Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: ఇస్రో గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సు.. దరఖాస్తు చేసుకోండిలా..!

ISRO: టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి పలు సంస్థలు. తాజాగా ఇండియన్​స్పేస్​రిసెర్చ్​ ఆర్గనైజేషన్​(ISRO) రెండు ఉచిత..

ISRO: ఇస్రో గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సు.. దరఖాస్తు చేసుకోండిలా..!
Follow us
Subhash Goud

| Edited By: Phani CH

Updated on: Nov 02, 2021 | 9:49 AM

ISRO: టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి పలు సంస్థలు. తాజాగా ఇండియన్​స్పేస్​రిసెర్చ్​ ఆర్గనైజేషన్​(ISRO) రెండు ఉచిత కోర్సులను ప్రారంభించింది. ఇస్రో పరిధిలోని డెహ్రాడూన్​లో ఉన్న ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ రిమోట్​సెన్సింగ్ (IIRS).. రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్​ ఇన్ఫర్మేషన్​సిస్టమ్‌పై ఆన్‌లైన్‌ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉచిత ఆన్‌లైన్‌ కోర్సులు మొత్తం 12 రోజుల్లో పూర్తవుతాయి. ఈ కోర్సులు వ్యవసాయం, నేల, అటవీ, జీవావరణ శాస్త్రం, జియోసైన్స్, భౌగోళిక ప్రమాదాలు, మెరైన్​ అట్మాస్పియర్​రిమోట్ సెన్సింగ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తాయి. పట్టణాలు, నగరాల్లో నీటి వనరులు ఆవశ్యకతను తెలియజేస్తాయి.

40 శాతం ఉత్తీర్ణత మార్కులు..

ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తున్న విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కేంద్ర, లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేసే టెక్నికల్ లేదా​సైంటిఫిక్​స్టాఫ్, యూనివర్సిటీల పరిధిలోని పరిశోధకులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. కోర్సులో భాగంగా కనీసం 70 శాతం హాజరు, 40 శాతం ఉత్తీర్ణత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఇస్రో (ISRO) నుంచి పార్టిసిపెంట్​సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ కోర్సును నవంబర్​8 నుంచి నవంబర్ 26 వరకు నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌ కోర్సుల్లో ఎలాంటి టాపిక్స్‌ ఉంటాయి..

పంటలను అంచనా వేయడం, పర్యవేక్షించడం. రిమోట్ సెన్సింగ్, జీఐఎస్​ అప్లికేషన్, అలాగే రిమోట్ సెన్సింగ్, జియోలాజికల్ స్టడీస్‌తో కోస్టల్ జోన్ మేనేజ్​మెంట్‌. రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ల సహాయంతో భూగర్భ అధ్యయనం. ఇక విపత్తు నిర్వహణకు అవసరమయ్యే స్పేస్-ఎనేబుల్డ్ ప్రొడక్ట్స్ , సర్వీసులను తెలియజేయడం. అర్బన్​​ ప్రాంతాల్లో రిమోట్ సెన్సింగ్ వ్యవస్థ అమలుపై అవగాహనపై ఉంటుంది. వాతావరణ, సముద్ర పర్యావరణానికి రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ లాంటివి ఉంటాయి.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లెక్చర్ స్లైడ్‌లు, వీడియో-రికార్డెడ్ లెక్చర్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్, హాండ్​అవుట్​డెమాన్​స్ట్రేషన్​వంటి పద్దతుల్లో కోర్సు స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకువస్తారు.

ఇవి కూడా చదవండి:

APPSC Recruitment: హార్టికల్చర్‌లో డిగ్రీ చదివిన వారికి గుడ్‌న్యూస్.. భారీ వేతనంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్‌డేట్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

JNVST 2022: విద్యార్థులకు గమనిక..! నవోదయ స్కూల్స్‌లో ప్రవేశాలకు చివరితేదీ పొడగింపు..

బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా
పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్
పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్