Trs vs Bjp: బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడండి.. మంత్రి హరీష్ రావు మార్క్ కామెంట్స్..

Trs vs Bjp: తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. యాసంగిలో పండిన పంటను ఒక్క గింజ కూడా కొనలేము

Trs vs Bjp: బీజేపీ నాయకులకు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడండి.. మంత్రి హరీష్ రావు మార్క్ కామెంట్స్..
Minister Harish Rao
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 01, 2021 | 9:25 PM

Trs vs Bjp: తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్ర ప్రభుత్వం తీరుపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. యాసంగిలో పండిన పంటను ఒక్క గింజ కూడా కొనలేము అని ఎఫ్‌సీఐ లేఖ రాసిందని, కేంద్ర ప్రభుత్వం ధాన్యం తీసుకోదంటూ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం ఏమాత్రం రావడం లేదన్నారు. ఎఫ్‌సిఐ ఎప్పటికప్పుడు వడ్లు తీసుకోవడం లేదని, చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మంత్రి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని పత్తి మార్కెట్‌ యార్డ్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు విషయంలో మొండి వైఖరితో వ్యవహరిస్తోందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి వడ్లు కొనుగోలుపై చర్చించారని, అయినా కేంద్రం సరిగా స్పందించడం లేదన్నారు.

ప్రతి రాష్ట్రంలో వేర్వేరు విధాలుగా పంటలు ఉంటాయని, అలాగే తెలంగాణలో వరి బాగా పండుతుందన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి ఫైర్ అయ్యారు. కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. 24 గంటల కరెంట్ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనుగోలు విషయంలో అడ్డు పడుతుందని విమర్శలు గుప్పించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రంలో మాట్లాడటం కాదు.. ఢిల్లీకి వెళ్లి యాసంగిలో వేసే పంటను కూడా కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. రాష్ట్ర బీజేపీ పార్టీ ఎంపీలు ఇక్కడ నోరు పారేసుకోవడం కాదు.. తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే ఢిల్లీకి వెళ్లి అక్కడి నాయకులతో మాట్లాడాలని అన్నారు. యాసంగిలో పండే పంటను కూడా కొనుగోలు చేసేలా వీరు ఒత్తిడి తీసుకురావాలన్నారు.

Also read:

సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్‌..! ఇప్పుడు కారులో కూర్చొని సినిమా చూడొచ్చు.. ఎక్కడంటే..?

TRS Telangana Vijaya Garjana: టీఆర్ఎస్ తెలంగాణ విజయ గర్జన సభ వాయిదా.. మరో తేదీ ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

Ducati: డుకాటి కంపెనీ బైక్‌ ఖరీదు రూ.10 లక్షలు.. ఫీచర్లు, స్పీడ్‌ గురించి తెలిస్తే షాక్ అవుతారు..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?