Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌.. మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం

మహారాష్ట్ర మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు.

Anil Deshmukh: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌.. మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం
Anil Deshmukh
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 02, 2021 | 6:35 AM

Anil Deshmukh Arrest: మహారాష్ట్ర మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌ అయ్యారు. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఈడీ అధికారులు సోమవారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయలు లంచం డిమాండ్‌ చేశారని ఆరోపణలతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో మనీలాండరింగ్‌ అంశంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించినప్పటకీ కోర్టు తన పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే, ఇటీవల దేశ్‌ముఖ్‌ ఆస్తులపై ఈడీ దాడి చేసి పలు ఆస్తులను జప్తు చేసింది.

ముంబయిలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి సచిన్‌ వాజేను అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆదేశించినట్లు ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరంబీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలు గతంలో సంచలనం అయ్యాయి. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై విచారణ చేపట్టాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది.

మనీలాండరింగ్‌పై తనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇటీవల అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఓ వీడియో విడుదల చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తమనీ ఆయన పేర్కొన్నారు. అయితే అనిల్‌ దేశ్‌ముఖ్‌ లంచం ఆరోపణల కేసులో సీబీఐ ఆదివారం ఓ వ్యక్తిని అరెస్టు చేసింది.

Read Also… క్రైమ్ సినిమాను తలదన్నేలా కర్నూలు జిల్లాలో ఘటన.. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు బైక్‌పై తీసుకెళ్తుండగా..