AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: గంజాయి స్మగ్లింగ్‌.. ఏపీ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..

Janasena Pawan Kalyan: గంజాయి సాగుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం ఇచ్చి,

Pawan Kalyan: గంజాయి స్మగ్లింగ్‌.. ఏపీ సర్కార్‌పై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..
Pawan Kalyan
Shiva Prajapati
|

Updated on: Nov 01, 2021 | 10:24 PM

Share

Janasena Pawan Kalyan: గంజాయి సాగుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గంజాయి సాగును కట్టడి చేసేందుకు ఏపీ పోలీసులకు పూర్తి అధికారం ఇచ్చి, తగిన పరిస్థితులు ఇవ్వ౦డి 48 గంటల్లో కట్టడి చేస్తారని అన్నారు. కానీ అలా అవకాశం ఇవ్వరని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సోమవారం నాడు విశాఖ అర్బన్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన పవన్ కళ్యాణ్.. రోడ్ల దుస్థితిపై ఎలా ఉద్యమించామో అలాగే ఏపీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ పైగా జనసేన ఉద్యమిస్తుందని హెచ్చరించారు. విశాఖ మన్యంలో రూ.4 వేల కోట్ల గంజాయి సాగు అవుతోందని, కాదంటే ఏపీ ప్రభుత్వం అఖిల పక్షాన్ని విశాఖ మన్యానికి తీసుకువెళ్ళాలని అన్నారు. గ౦జాయి సాగయితే అందరం కలిసే ధ్వంసం చేద్దాం అని పవన్ కళ్యాణ్ సూచించారు. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దగ్గర డ్రగ్స్ ఉన్నాయో లేదో తెలియదు కాని కేసులు మాత్రం నమోదు చేశారని అన్నారు. మరి ఇన్ని వేల కోట్ల గంజాయి ఉన్న చోట ఎంత బలంగా చట్టం పనిచేయాలని ప్రశ్నించారు. రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ఉపయోగించుకొని గంజాయి ఎక్కడ సాగు అవుతుందేని గుర్తించలేరా? అని ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

Also read:

Badvel By Election: బద్వేల్‌ బాద్‌షా ఎవరు?.. మరికొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..

Viral Video: పామును చెడుగుడు ఆడుకున్న ముంగీస.. ఫైట్‌లో గెలిచింది ఎవరంటే? వీడియో వైరల్!

Winter Health Tips: వచ్చేది చలికాలం.. మరి ఏం చేయాలో.. ఏం చేయకూడదో తెలుసా..