TMC: పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో‎ టీఎంసీ హవా.. అన్ని స్థానాల్లో ఘన విజయం..

పశ్చిమ బెంగాల్‎లో జరిగిన ఉపఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో రెండు బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి....

TMC: పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల్లో‎ టీఎంసీ హవా..  అన్ని స్థానాల్లో ఘన విజయం..
Tmc
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 02, 2021 | 5:15 PM

పశ్చిమ బెంగాల్‎లో జరిగిన ఉపఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. నాలుగు చోట్ల ఉప ఎన్నికలు జరగ్గా.. అన్ని చోట్ల టీఎంసీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో రెండు బీజేపీ సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. గెలిచిన అభ్యర్థులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందించారు. ” బంగాల్ ప్రచారం, ద్వేషపూరిత రాజకీయాల కంటే అభివృద్ధి, ఐక్యతను ఎంచుకుంటుంది” అని చెప్పారు. దిన్​హాటా, గోసబలో లక్షకు పైగా ఓట్ల తేడాతో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందారు.

పశ్చిమ బెంగాల్‎లోని దిన్​హాటా, శాంతిపుర్​, గోసబ, ఖార్​దహ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్​-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్​హాటాలో భాజపా నేత నిశిత్​ ప్రామాణిక్ గెలుపొందారు. అతన్ని కేంద్ర సహాయమంత్రిగా తీసుకోవడం వల్ల అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు టీఎంసీ లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతల వలసలతో సతమతమవుతున్న బీజేపీకి దిన్‌హటా, శాంతిపూర్‌ ఎన్నికల ఓటమి పెద్ద దెబ్బగా చెప్పొచ్చు.

ఖర్దాలో సీపీఎం కంటే బీజేపీ వెనుకబడి మూడో స్థానంలో నిలిచింది. కోల్‌కతా మాజీ మేయర్ సోవాందేబ్ చటోపాధ్యాయ ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్‎లో ఓడిపోయారు. మళ్లీ ఆమె పోటీ చేయడానికి సోవాందేబ్ చటోపాధ్యాయ తన సీటును త్యాగం చేశారు. దీంతో అతనికి ఖర్దా సీటు ఇచ్చారు. కొత్తగా నాలుగు స్థానాల్లో గెవటంతో టీఎంసీ ఎమ్మెల్యేల సంఖ్య 213కు చేరుకుంది.

Read Also.. Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్..