AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Huzurabad Elections – Trs: హుజూరాబాద్‌ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..

Huzurabad Elections - Trs: హుజురాబాద్‌లో నాగార్జున సాగర్ వ్యూహం వర్కవుట్ అవ్వలేదా?.. నెలలు నెలలుగా మండలాల్లో మకాం వేసి గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఇన్‌ఛార్జిల పాచికలు పారలేదా?..

Huzurabad Elections - Trs: హుజూరాబాద్‌ ఓటమిపై గులాబీ బాస్ గుస్సా!.. ఆందోళనలో ఇన్‌చార్జిలు..
Cm Kcr
Shiva Prajapati
|

Updated on: Nov 03, 2021 | 5:09 PM

Share

Huzurabad Elections – Trs: హుజురాబాద్‌లో నాగార్జున సాగర్ వ్యూహం వర్కవుట్ అవ్వలేదా?.. నెలలు నెలలుగా మండలాల్లో మకాం వేసి గెలుపు ధీమా వ్యక్తం చేసిన ఇన్‌ఛార్జిల పాచికలు పారలేదా?.. పట్టువున్న ప్రాంతాల్లో కూడా ఓట్లు రాకపోవడంపై గులాబీ బాస్ గుర్రుగా ఉన్నట్టు సమాచారం అందుతోంది. హుజూరాబాద్ ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?.

హుజురాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే అన్ని మండలాల్లో పాగా వేసిన ఇన్‌చార్జిలుు అనుకున్న ఫలితాలు రాబట్టకపోవడంపై టిఆర్‌ఎస్ పార్టీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు పట్టువున్న చోట కూడా బోల్తా పడటంతో వీరు చేసింది ఏంటి? అని అధిష్టానం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరి మండలాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి? అక్కడ ప్రత్యర్థి ఈటెల రాజేందర్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయి? బీజేపీ చేసింది ఏంటి? మనం చేసింది ఏంటి? ఇలా పాయింట్ టూ పాయింట్ లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.

హుజూరాబాద్ మున్సిపాలిటీని మంత్రి గంగుల కమలాకర్, జమ్మికుంట మున్సిపాలిటీ బాధ్యతలను మంత్రి ఈశ్వర్ పర్యవేక్షించారు. మండలానికి ఇద్దరికిపైగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇన్‌చార్జిలుగా వ్యవహరించి ప్రచార బాధ్యతలను భుజ స్కంధాలపై వేసుకున్నారు. జమ్మికుంట మున్సిపాలిటీకి మంత్రి కొప్పులతో పాటు ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, కమలాపూర్ మండలానికి ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చల్ల ధర్మారెడ్డి, ఇల్లందకుంట మండలానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుంకే రవి శంకర్, జమ్మికుంట మండలానికి ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వీణవంక మండలానికి ఎమ్మెల్యేలు పెద్ద సుదర్శన్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, హుజూరాబాద్ మండలానికి ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్, గువ్వల బాలరాజు ఇన్‌చార్జిలుగా వ్యవహరించారు. వీరందరిని మంత్రి హరీష్ రావు మానిటర్ చేశారు.

ఈటెల రాజేందర్ నుండి పార్టీని కంట్రోల్ లోకి తెచ్చుకుని ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినా.. నెలలుగా కార్యాచరణ తీసుకున్నా.. ఎందుకు సక్సెస్ కాలేదు? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. కమలపూర్, ఇళ్లందకుంట, హుజురాబాద్ లోకల్, విణవంక లాంటి మండల్లాలో టిఆర్‌ఎస్‌కు ఎక్కువ ఓట్లు వస్తాయని అనుకున్నా.. చివరకు అక్కడే ఈటెలకు మెజార్టీ రావడంతో ఆయా మండలలా ఇన్‌చార్జిలకు ఇప్పుడు ఆందోళన మొదలైంది. లెక్కలతో సహా ఇన్‌చార్జిల పనితనంపై నివేదికలు తెచ్చుకున్న గులాబీ బాస్ కేసీఆర్ కు.. తమ మెహం ఎలా చూపెట్టాలి అని ఆ ఎమ్మెల్యే లు , మంత్రలు సతమతం అవుతున్నారట. మరి గులాబీ బాస్ వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.

Also read:

Andhra Pradesh: నవంబర్ 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ సర్కార్..

Hero Vishal: శ్రీవారి సన్నిధిలో హీరో విశాల్.. కాలినడకన తిరుమలకు చేరిన ఫొటోస్…

Crime News: వృద్ధ దంపతుల దారుణ హత్య.. కత్తులతో గొంతు కోసి పరారైన దుండగులు..