Hero Vishal: శ్రీవారి సన్నిధిలో హీరో విశాల్.. కాలినడకన తిరుమలకు చేరిన ఫొటోస్…
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని సినిమా తారలు దర్శించుకోవడం సర్వసాధారణం. తమ సినిమాల రిలీజ్ లకు ముందు లేదా సినిమా హిట్ అయిన తరవాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తాజాగా తమిళ్ స్టార్ హీరో విశాల్ తిరుమలలో సందడి చేశారు.
Updated on: Nov 03, 2021 | 5:02 PM

కలియుగ దైవం తిరుమల శ్రీవారిని సినిమా తారలు దర్శించుకోవడం సర్వసాధారణం. తమ సినిమాల రిలీజ్ లకు ముందు లేదా సినిమా హిట్ అయిన తరవాత వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

తాజాగా తమిళ్ స్టార్ హీరో విశాల్ తిరుమలలో సందడి చేశారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకున్నారు. మెట్ల మార్గాన తిరుమలకు చేరుకున్నారు విశాల్.

విశాల్ ను చూసిన అభిమానులు ఆయనతో సెల్ఫీలు తీగడానికి ఎగబడ్డారు. విశాల్ ఎంతో ఓపికగా అందరికి సెల్ఫీలు ఇచ్చారు.

అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయనను నగిరి ఎమ్మెల్యే రోజా కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు విశాల్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నటించిన ఎనిమి సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతుందని, సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను నటించిన ఎనిమి సినిమా దీపావళి కానుకగా విడుదల కాబోతుందని, సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.

అలాగే దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి మాట్లాడుతూ.. పునీత్ మా ఇంట్లో మనిషి…

నేను ఇల్లు కొనాలని దాచుకున్న డబ్బును ఆ 1800 మంది విద్యార్థులకు కేటాయిస్తున్నా అని అన్నారు. పునీత్ చదివిస్తున్న 1800మంది పిల్లలను ఇక పై విశాల్ చదివిస్తాని మాట ఇచ్చిన విషయం తెలిసిందే..

హీరో విశాల్ తిరుమల లో ఫొటోస్

హీరో విశాల్ తిరుమల లో ఫొటోస్
