KCR Dalita Bandhu: దళిత బంధు పథకంపై వేగంగా అడుగులు వేస్తోన్న కేసీఆర్‌.. పథకం అమలు విధి విధానాలపై సమీక్షా సమావేశం.

KCR Dalita Bandhu Scheme: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న 'తెలంగాణ దళిత బంధు' పథకంపై వేగంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా...

KCR Dalita Bandhu: దళిత బంధు పథకంపై వేగంగా అడుగులు వేస్తోన్న కేసీఆర్‌.. పథకం అమలు విధి విధానాలపై సమీక్షా సమావేశం.
Dalita Badhu Scheme Kcr
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: Jul 20, 2021 | 5:47 AM

KCR Dalita Bandhu Scheme: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ‘తెలంగాణ దళిత బంధు’ పథకంపై వేగంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా పథకం అమలు చేసేందుకు వడివడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దళిత బంధు పథకం అమలు విధి విధనాలు, రూపొందించాల్సిన ఉపాధి పథకాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగత ఇభవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ అభివృద్ధిని తామే నిర్వచించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. త్వరగా ఆర్థిక స్వావలంబన కలిగించే వినూత్న ఉపాధి స్కీంలను ‘తెలంగాణ దళిత బంధు’ పథకంలో భాగంగా రూపకల్పన చేసి లబ్ధిదారుల ముందుంచాలని అధికారులుకు సీఎం ఆదేశించారు.

ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ డెవలప్ కార్పోరేషన్ ఎండీ పి.కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ‘క్షేత్రస్థాయిలో పైలట్ ప్రాజెక్టు నియోజకవర్గ గ్రామాల్లో పర్యటించి దళిత కుటుంబాల స్థితి గతులను అర్థం చేసుకోవాలి. వారి అభిప్రాయాలను సేకరించాలి. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వారికి అనువైన రీతిలో త్వరితగతిన ఆర్థిక స్థిరత్వాన్ని కలిగించే పలు రకాల పనులను గుర్తించి వాటిని పథకాలుగా మలచాలి. ఉన్నతాధికారులు ప్రభుత్వ యంత్రాంగం పైలెట్ ప్రాజెక్టు కేంద్రంగా ముందు అవగాహన పెంచుకోవాలి. ఉపాధి కల్పించే పలు వినూత్న పథకాల రూప కల్పనకోసం క్షేత్రస్థాయి పర్యటలను ఎలా చేపట్టాలి, ఆ సందర్బంగా ఎవరెవరిని కలవాలి, వారి నుంచి సమాచారం ఏ విధంగా తీసుకోవాలి, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న అనుభవజ్జుల సలహాలను పాటించి వారి సూచనలను పథకంలో భాగంగా ఎలా అమలు పరచాలి… అనే అంశాల మీద ముందుగా అధికారులు అవగాహనకు రావాల’ని సీఎం తెలిపారు.

Also Read: Heroin seizes: సౌదీ టు హైదరాబాద్ వయా జాంబియా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్‌

RS Praveen Kumar: ఇక ప్రజాసేవలో.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్..

BharatPe offers: భారీ ఆఫర్లను ప్రకటించిన భారత్‌పే.. BMW బైక్, ఆపిల్ ఐప్యాడ్ ఫోన్లు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!