Heroin seizes: సౌదీ టు హైదరాబాద్ వయా జాంబియా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్
దుబాయ్, సౌదీ అరేబియా, జాంబియా.. ఇలా వివిధ దేశాల నుంచి అక్రమంగా డ్రగ్స్‌ని భారత్‌కు తరలిస్తున్నారు. అయితే ఎయిర్‌పోర్టులోనే దొరికిపోతున్నారు. తాజాగా మరోసారి కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుబడింది.
హైదారాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఎంత పగడ్భంధీగా తనిఖీలు చేసినా, డ్రగ్స్ అక్రమ దందా కొనసాగుతూనే ఉంది. తాజాగా 21 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పట్టుబడింది. జాంబియా దేశానికి చెందిన ఓ మహిళ దగ్గరి నుంచి 3.2 కేజీల హెరాయిన్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాంబియా దేశం నుంచి ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానంలో దోహా మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది ఓ మహిళ. అయితే ఆమె ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే ముందస్తు సమాచారంతో డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
నిందితురాలు బ్యాగ్‌ను అధికారులు తనిఖీ చేయగా, అందులో 3.2 కేజీల హెరాయన్ ను గుర్తించారు. దీంతో నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు డిఆర్‌ఐ అధికారులు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన హెరాయిన్ విలువ 21 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు విదేశాల నుంచి భారత్‌కు బంగారం అక్రమ రవాణా కొనసాగుతుండగా, అటు డ్రగ్స్‌ని కూడా పెద్ద ఎత్తునా తరలించడం ఆందోళనకు గురి చేస్తోంది. బంగారం అక్రమ రవాణా చేసేవారు కస్టమ్స్ అధికారులకు పట్టుబడకుండా ఉండేందుకు వివిధ మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఎంత అతితెలివితో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డా, కస్టమ్స్ అధికారులకు మాత్రం దొరికిపోతున్నారు. ఇటు డ్రగ్స్ అక్రమ రవాణా చేసేవారిపై అధికారులకు ముందస్తుగానే సమాచారం రావడంతో అలర్ట్ అవుతున్నారు. నిందితులు ఎయిర్‌పోర్టులోకి అడుగు పెట్టగానే అదుపులోకి తీసుకుంటున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శంషాబాద్‌తో పాటు చెన్నై ఎయిర్‌పోర్టులో కూడా అక్రమ రవాణా కొనసాగుతోంది. గోల్డ్‌తో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్నారు నిందితులు. చెన్నై, ఢిల్లీతో పాటు ఇటు శంషాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టబడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్‌గా ఉంటూ, డ్రగ్స్ దందాకు చెక్ పెడుతున్నారు.