Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కుక్క నటన… పిల్లి గాండ్రింపు.. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..

సోషల్ మీడియా ప్రపంచం నిజంగా ఓ అద్భుతమైనది. మీరు మీ ఫోన్‌ను చూసి ప్రతిసారి ఏదో ఒకటి  నవ్వించేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. కొన్ని వీడియోలు చాలా  వెరైటీగా ఉంటాయి. వాటిని..

Viral Video: కుక్క నటన... పిల్లి గాండ్రింపు.. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..
Viral Video Of Puppy Who Ch
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 19, 2021 | 5:21 PM

సోషల్ మీడియా ప్రపంచం నిజంగా ఓ అద్భుతమైనది. మీరు మీ ఫోన్‌ను చూసి ప్రతిసారి ఏదో ఒకటి  నవ్వించేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. కొన్ని వీడియోలు చాలా  వెరైటీగా ఉంటాయి. వాటిని చూసిన తర్వాత.. మీరు వాటిని షేక్ చేయకుండా జీవించలేరు. కరోనా సమయంలో ఇలాంటివి కొంత ఉల్లాసాన్ని ఇస్తుంటాయి. ముఖ్యంగా జంతువులు చేసే చిలిపి పనులు.. వాటి ఆటలు చూస్తుంటే నిజంగా హాయిగా ఉంటుంది. అంతే కాదు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

దీంతో ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఒకప్పుడు శత్రువుల గురించి మాట్లాడాలి అంటే ఎలుక-పిల్లి.. కుక్క-పిల్లి ఇలా ఉండేది కాని సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ లెక్క మారందనే చెప్పాలి. అసలైన మనం మాట్లాడుతున్న వీడియోలో ఒక కుక్క, పిల్లిని చూసి భయపడుతుంది.

కుక్క, పిల్లి పాత శత్రువులు అని మనందరికీ తెలుసు. పిల్లిని చూడటంతోనే గ్రామ సింహం దాడికి ప్రయత్నిస్తుంది. ఇది గమనించిన పిల్లి తుఫాను వేగంతో ఒక చెట్టుపైకో లేదా భవనం పైన ఎక్కుతుంది. కానీ ప్రతి పిల్లి ఇలా చేయదు. పిల్లిని చూసిన వెంటనే దానిపై దాడి చేయడానికి కుక్క పరుగెత్తింది. కుక్కను చూసి పరిగెత్తాల్సిన పిల్లి ఒక్కసారిగా వెనక్కి తిగింది.. అంతే కుక్క భయంతో అక్కడే కూర్చుండి పోయింది. కొన్ని పిల్లులు కుక్కలకు ఒక పాఠం కూడా బోధిస్తాయి. అలాంటి ఒక వీడియోను మేము సోషల్ మీడియాలో చూడవలసి వచ్చింది. ఇక ఇది చూసి మీరూ నవ్వండి..

పిల్లి వెనుక కుక్క నడుస్తున్నట్లు మనం వీడియోలో చూడవచ్చు. పిల్లికి ఈ విషయం తెలియకపోవచ్చు.. కానీ పిల్లికి ఈ విషయం తెలియగానే అది కాసేపు ఆగి వెనక్కి తిరిగి చూస్తుంది.. అంతే ఆ తరువాత కుక్కపిల్ల భయపడి.. అక్కడ కూర్చున్నట్లు నటిస్తుంది. పిల్లి మరోసారి ముందుకు కదలడం ప్రారంభిస్తుంది. దీని తరువాత పిల్లిని ఫాలో అవుతుంది.కుక్కపిల్ల నేలమీద కూర్చుని దాని శరీరాన్ని గోకడం ప్రారంభిస్తుంది.

సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చాలా మంది నెటిజన్లు రికాక్ట్ అయ్యారు. పిల్లి పట్ల అలాంటి భయాన్ని తాను మొదటిసారి చూశానని..ఓ యూజర్ రాసుకొచ్చాడు. మరోవైపు, మరొక యూజర్ ఈ క్లిప్ చూసిన తర్వాత చిన్న పిల్లవాడు తప్పు చేసిన తర్వాత తనకు ఏమీ తెలియని విధంగా తల్లిదండ్రుల ముందు నటించినట్లుగా ఉందని రీ ట్వీట్ చేశాడు. ఇది కాకుండా.. అనేక ఇతర వినియోగదారులు ఈ వీడియోను రకరకాలుగా ప్రశంసించారు.

ఈ ఫన్నీ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగూసామి తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి రీట్వీట్ చేశారు. ఇది ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వీక్షించబడింది. అదే సమయంలో ఈ వీడియో ద్వారా 390 లైక్‌లు, 29 రీట్వీట్‌లు కూడా వచ్చాయి.

ఇవి కూడా చదవండి: Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

Viral Video: వధువు పక్కనే ఉండగా… వరుడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!! వీడియో