Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

ప్రియుడుకోసం తాళికట్టిన భర్తను అతికిరాతకంగా హత్య చేయించిన కిలాడే లేడీ కథ.! దుబాయ్‌లో ఉంటే తనకు సుధాకర్‌ రెడ్డితో ప్రమాదమేమోనని భయపడి విశాఖ వచ్చిన సతీష్‌కు.. ఇక్కడా భార్య రూపంలో...

Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..
Killer Lovers
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 19, 2021 | 4:00 PM

ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు..! ప్రేమించుకుని విడిపోయారు. ఆ తరువాత ఆమెకు పెళ్ళైనా మళ్ళీ వాట్సాప్‌ గ్రూప్‌లో కలిశారు. అంతే..! ఇక.. అన్నీ మరిచిపోయి వివాహేతర బంధాన్ని కొనసాగించారు. చివరకు కట్టుకున్న భర్తకే స్కెచ్‌ వేసి.. దారుణంగా చంపేశారు. విశాఖలో కిల్లర్‌ లేడీ కంన్నింగ్‌ స్కెచ్‌కు ప్రియుడు తోడై భర్త ప్రాణాలు తీసేశారు. కనీసం తమకు పుట్టిన ఆ చిన్నారుల ముఖాన్ని చూసి కనికరం లేకుండా.. వారికి తండ్రిని దూరం చేసేశారు. తల్లి చేసిన పాపానికి ఆ చిన్నారులు అనాథలుగామారారు.

అవును.. విశాఖ మధురవాడ ఎన్జీవోస్‌ కాలనీలో జరిగిన సతీష్‌ హత్య కేసులో సంచనల నిజాలు బయటపడ్డాయి. దుబాయ్‌లో ఉండి వచ్చిన సతీష్‌కు… అక్కడే ఉంటున్న సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తితో విబేదాలున్నట్టు.. అతనే ఈ మర్డర్‌ స్కెచ్‌ వేసి ఉంటాడని అంతా అనుమానించారు. భార్య కూడా అదే విషయం చెప్పుకొచ్చింది. పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది.

కుటుంబ సభ్యులు కూడా ఆ కోణంలోనే ఆలోచించారు. కానీ.. ఆధారాలు అసలు నిందితులను విడిచిపెడతాయా..? అంతే.. సతీష్‌ హత్య కేసులో పోలీసులకు లభించిన క్లూస్‌ వెరిఫై చేసి.. ఓ వ్యక్తిని ట్రాక్‌ చేశారు. అతని పేరు షేక్‌ భాషా. వాడిని ట్రాక్‌ చేసి విచారించే సరికి.. ఇంకేముందీ..? సతీష్‌ను హత్య చేసింది భాషా అని తేలింది. కానీ.. చేయించింది మాత్రం సతీష్‌ భార్య రమ్య..! అంతా షాక్ ఎందుకు..? ఎలా అని విచారణ మొదలు పెట్టారు పోలీసులు. తీగ లాగారు అసలు సంగతి కక్కించారు.

భర్త పాలిట విలన్..

భర్త హత్య కేసులో భార్యే విలన్‌గా మారింది. ప్రియుడుతో కలిసి ప్లాన్‌ చేసి కట్టుకన్న భర్తనే చంపించింది. కానీ ఏమీ ఎరగనట్టు నటించింది. ఇంతకీ.. రమ్యకు భాషా ఎలా పరిచయం..? ఆ దుబాయ్‌ సుధాకర్‌ రెడ్డి పేరుతో రమ్య ఎందుకు పోలీసులను నమ్మించాలని చూసింది. తన చేతికి మట్టి అంటకుండా రమ్య ఎటువంటి ప్లాన్‌ చేసింది..?

ఈనెల 13.. రాత్రి ఏడున్నర ప్రాంతం.. మధురవాడ లోని ఎన్జీవోస్‌కాలనీలో నివాసముంటున్న సతీష్‌ హత్యకు గురయ్యాడు. ఇద్దరు పిల్లలతో కలిసి భార్యాభర్తలు వాకింగ్‌కు వెళ్ళారు. తిరిగి వస్తున్న సమయంలో భార్య తన బాబుతో పాటు ముందు నడుస్తోంది. వెనుక పాపను ట్రాలీలో వేసుకుని సతీష్‌ వస్తున్నాడు. ఈలోగా.. ఒక్కసారిగా సతీష్‌పై దాడి జరిగింది. వెనుకనుంచి ఎవరు తలపై మోదారు. సతీష్‌ కిందపడ్డాడు. భార్య రమ్య వెనక్కు తిరిగి చూసే సరికి.. సతీష్‌ కిందపడ్డాడు. అక్కడ ఎవరూ లేరు. కుప్పకూలిన సతీష్‌ను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ఈలోగా సతీష్‌ మృతిచెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

భార్య ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన విశాఖ క్రైం పోలీసులు.. దర్యాఫ్తు ప్రారంభించారు. రమ్య స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. సతీష్‌ను దాడి చేసింది ఎవరు..? ఎంతమంది వచ్చారు..? అనేది కూడా తనకు తెలియదని భార్య పోలీసులకు చెప్పింది. కానీ.. దుబాయ్‌లో ఉండే సుధాకర్‌రెడ్డి తన భర్తకు తరచూ కాల్ చేసేవాడని మాత్రం పోలీసులకు చెప్పింది. సుధాకర్‌రెడ్డితో సతీష్‌కు ఆర్థిక లావాదేవీలున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆరోజు ఏం జరిగింది..? రమ్య చెప్పిన కట్టు కథ అందరిని నమ్మించేలా ఉంది. అచ్చు సినిమా కథలా అందరినీ నమ్మించింది.

రమ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో..

రమ్య ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో పోలీసులు విచారణ ప్రారంభించారు. స్పాట్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో కాస్త కష్టపడాల్సి వచ్చింది. అయితే.. పోలీసులు పదే పదే ప్రశ్నించే సరికి.. స్పాట్‌లో తాను సతీష్‌కు అయిదునుంచి ఆరడుగుల దూరంలో ఉన్నానని.. అయినా ఎవరు దాడిచేశారో తనకు తెలియదని చెప్పింది రమ్య. వెనక్కి తిరిగి చూసే సరికి సతీష్‌ కిందపడి వున్నాడని.. దాదాపు పదినుంచి పదిహేను అడుగుల దూరంలో ఎవరో వ్యక్తి వెళ్తున్నట్టు కనిపించిందని చెప్పుకొచ్చింది. దుబాయ్‌లో ఉండే సుధాకర్‌రెడ్డి కూడా తరచూ తన భర్తకు, తనకు కాల్ ఆర్థిక లావాదేవీల విషయంలో కాల్స్‌ చేసేవాడని చెప్పింది రమ్య. అయితే.. దుబాయ్‌లో ఉండే సుధాకర్‌రెడ్డిపై వెరిఫై చేశారు క్రైం పోలీసులు. కానీ.. ఎక్కడా లింక్‌ కుదరలేదు. స్పాట్‌లో అసలు ఏం జరిగిందో కచ్చితంగా రమ్య చెప్పలేకపోతుండడడంతో పాటు సతీష్‌ హత్యకు గురవడంతో ఆమెను తొలుత రెండు రోజులు ఆమెను ప్రశ్నలు వేసి మరింత బాధించాలని అనుకోలేదు పోలీసులు. ఇక్కడ స్టోరీ కట్ చేస్తే.. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది.

పోలీసులకు రమ్య చెప్పిందేమిటి..?

భార్య ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాఫ్తు ప్రారంభించారు. రమ్య స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. సతీష్‌ను దాడి చేసింది ఎవరు..? ఎంతమంది వచ్చారు..? అనేది కూడా తనకు తెలియదని భార్య పోలీసులకు చెప్పింది. కానీ.. దుబాయ్‌లో ఉండే సుధాకర్‌రెడ్డి తన భర్తకూతరచూ కాల్ చేసేవాడని మాత్రం పోలీసులకు చెప్పింది. సుధాకర్‌రెడ్డితో సతీష్‌కు ఆర్థిక లావాదేవీలున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది.

ఇంతకీ.. మరి సతీష్‌ ఎలా హత్యకు గురయ్యాడు..?

మధురవాడకు చెందిన రమ్యకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన కోనె సతీష్‌తో 2015లో వివాహమైంది. ఆ తరువాత ఇద్దరూ దుబాయ్‌ వెళ్లారు. అక్కడే బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు సతీష్. ఆ తరువాత బ్యాంకు ఉద్యోగం మానేశాడు. అక్కడే ఉన్న మరో వ్యక్తి సుధాకర్‌రెడ్డితో కలిసి ఆర్థిక వ్యవహారాల వ్యాపారం చేసుకునేవారు. 2017లో సతీష్‌, రమ్యకు ఓ పాప పుట్టింది. 2019లో మళ్ళీ రమ్య గర్భం దాల్చడంతో ప్రసవం కోసం అదే ఏడాది ఆగస్టులో విశాఖ వచ్చేసింది రమ్య. అప్పటినుంచి విశాఖలోనే ఉండిపోయింది. ఎందుకంటే.. లాక్‌ డౌన్‌ కావడం, పాపకు అనారోగ్యం కావడంతో ఆమెకు ట్రీట్‌మెంట్‌ చేయడం కోసం. ఇదే విషయం రమ్య చెప్పింది.

మూడో వ్యక్తి ఎవరు..? 

విశాఖ మధురవాడ ఎన్జీవోస్‌ కాలనీలో ఈనెల 13 రాత్రి జరిగిన సతీష్‌ హత్య కేసులో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాఫ్తు చేశారు. దుబాయ్‌‌లో ఉండే సుధాకర్‌రెడ్డితో సతీష్‌కు ఉండే ఆర్థిక వ్యవవహారాలపైనా ఆరా తీశారు. ఈ సమయంలో.. స్పాట్‌లో ఆధారాలను సేకరించి.. సమీపంలో ఉండే CC కెమెరాలను కూడా పరిశీలించారు. ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి స్పాట్‌ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తిలా అనుమానించి.. అతన్ని ట్రాక్‌ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు.

CC కెమెరా ఫుటేజ్‌తో..

మెల్లగా కూపీ లాగే సరికి.. ఆ CC ఫుటేజ్‌తో పాటు టెక్నికల్‌ ఎవిడెన్ష్‌ను కలెక్ట్‌ చేశారు. ఆ ఘటన జరిగిన సమయంలో ఆ స్పాట్‌లో ఉన్న వ్యక్తికోసం ఆరా తీశారు. ఆరిలోవ ప్రాంతానికి చెందిన షేక్‌ భాషా ఆ సమయంలో అక్కడ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. అతన్ని వెతికి అదుపులోకి తీసుకుని విచారించారు. అతడే.. సతీష్‌ను తలపై వెనుకనుంచి రాడ్‌తో కొట్టి హత్యచేసి పారిపోయినట్టు పోలీసులు తేల్చారు.

ఇన్వెస్టిగేషన్‌ చేస్తూ..

పోలీసులు… ఇన్వెస్టిగేషన్‌ చేస్తూ పట్టుబడిన నిందితుడిని వెరిఫై చేసే సరికి రమ్య లింక్‌ కుదిరింది. రమ్యకు, భాషాకు ఉన్న పరిచయం పై పోలీసులు తీశారు. రమ్మ, భాషా ఇద్దరూ మధురవాడ లోని ఓ ప్రైవేటు స్కూల్లో టెన్త్‌ వరకు చదువుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఆ తరువాత వేర్వేరువేర్వేరు విద్యాసంస్థలకు వెళ్ళినా.. తమ ప్రేమాయణాన్ని కొనసాగించారు. బీచ్‌లు, సినిమాలు, షికార్లు చేశారు. 2013లో వీరి ప్రేమ విషయం పెద్దలకు తెలియడంతో ఇద్దరూ విడిపోయారు. ఆతరువాత 2015లో సతీష్‌తో రమ్యకు వివాహమైంది. భార్యభర్తలిద్దరూ దుబాయ్‌కు వెళ్ళిపోయారు. 2018లో భాషాకు కూడా వేరే యువతితో వివాహం జరిగింది.

మళ్లీ చిగురించిన ప్రేమ..

ఇంతవరకు బాగానే ఉన్నా.. 2019లో రమ్య స్కూల్‌ మేట్స్‌ అంతా కలిసి ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను క్రియేట్‌ చేశారు. అదే.. సతీష్‌ హత్య వరకు దారితీసింది. ఎలా అంటే.. వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసిన తరువాత ఆ గ్రూప్‌లో అప్పటి స్కూల్‌మేట్స్‌ అయిన రమ్య, భాషా కూడా చేరారు. దీంతో.. మళ్లీ వీరి మధ్య పరిచయం పెరిగింది. ఈలోగా.. 2019 ఆగస్టులో ప్రసవం కోసం దుబాయ్‌లో ఉన్న రమ్య విశాఖ రావడంతో వీరి ప్రేమ మళ్లీ చిగురించింది. ఒకరుకకరు కలుసుకోవడం చేసుకునే వారు. ఈలోగా దుబాయ్‌లో ఉన్న సతీష్‌.. అక్కడ సుధాకర్‌రెడ్డితో విభేదాల కారణంగా విశాఖకు వచ్చేశాడు. అక్కడే ఉంటే.. తన ప్రాణాలకు కూడా ముప్పుపొంచివుంటుందని గమనించి చెప్పకుండా ఇండియా వచ్చేశాడు సతీష్‌. అయితే.. విశాఖ వచ్చాక భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు సతీష్‌. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వాగ్వాదాలు కూడా జరిగేవి. అయితే.. సతీష్‌ మళ్ళీ భార్యకు నచ్చజెప్పి మధురవాడలో గత నెలలలో ఓ ఇంటికి షిఫ్ట్‌ అయ్యాడు. అప్పటినుంచి అక్కడే ఉండేవారు.

తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు..

ప్రియుడుకోసం తాళికట్టిన భర్తను అతికిరాతకంగా హత్య చేయించిన కిలాడే లేడీ కథ.! దుబాయ్‌లో ఉంటే తనకు సుధాకర్‌ రెడ్డితో ప్రమాదమేమోనని భయపడి విశాఖ వచ్చిన సతీష్‌కు.. ఇక్కడా భార్య రూపంలో ఉన్న చావు తప్పలేదు. ప్రియుడు మోజులో పడిన స్కెచ్ వేసినందుకు సతీష్‌ కాటికి వెళ్తే.. చేసిన నేరానికి రమ్య కటకటాల వెనక్కు వెళ్ళింది. కానీ ఏతప్పూ చేయని ఈ అభంశుభం తెలియని చిన్నారులు తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఒక్క తప్పు ఈ కుటుంబాన్నే కకావికలం చేసింది.

ఇవి కూడా చదవండి: Fake DSP: నెల్లూరు స్వామి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. అసలు కథ వేరే ఉంది..

Hyderabad: అమీర్‌పేట్‌లో దారుణం.. ‘నా ప్రాణం నువ్వు’ అంటూనే తన ప్రాణం తీసుకున్న యువకుడు..