AP Crime News : చిత్తూరు జిల్లాలో విషాదం.. గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి
AP Crime News : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల
AP Crime News : చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెలు మేపడానికి వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాంతిపురం మండలం చిన్నారి దొడ్డి గ్రామానికి చెందిన 11 ఏళ్ల దేవిశ్రీ, 10 ఏళ్ల శిల్ప ఇద్దరు అక్కచెల్లెళ్ళు. గొర్రెలను మేపడానికి గ్రామ పొలిమేరలకు వెళ్లారు. గొర్రెలతో పాటు వచ్చిన పెంపుడు కుక్కను దగ్గరలోని చింతమాను కుంటలో శభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు.
ఎవరు గుర్తించకపోవడంతో ఊపిరాడక ఇద్దరు నీటి కుంటలో మృతి చెందారు. కొద్దిసేపటకి స్థానికులు గుర్తించి కుంటలో గాలించి మృత దేహాలను బయటికి తీశారు. సంఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులు దారుణంగా మృతి చెందడంతో చిన్నారి దొడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
కాగా చిన్నారులు గొర్రెలు మేపడానికి వెళ్లడం ఏంటని అందరు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు నిజంగా ప్రమాదవశాత్తు చనిపోయారా.. లేదంటే ఎవరైనా కావాలని చేశారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఏది ఏమైనా ఇద్దరు పిల్లలను ఒంటరిగా వదలడంపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.