AP CM YS Jagan: ఏపీ ప్రజల జీవనాడి.. పోలవరం ప్రాజెక్టు అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎం వైఎస్ జగన్.. చిత్రాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి, 5 కోట్లమంది ప్రజల కలల ప్రాజెక్ట్. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వరప్రదాయని పోలవరం ప్రాజెక్టు.
Updated on: Jul 19, 2021 | 2:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు.


పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని విధాలుగా బాధితులకు అండగా ఉంటామిన సీఎం జగన్ హామీ ఇచ్చారు.

స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు.

ఇక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.

పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
