Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో ఇద్దరు నకిలీ ఖాకీలు చిక్కారు.. స్కెచ్ వేశారు, కానీ సీన్ రివర్సయ్యింది
తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డిఎస్‌పి స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ...
తెలంగాణలో రోజుకో ఫేక్ పోలీస్ పుట్టుకొస్తున్నాడు. మొన్న నకిలీ డిఎస్‌పి స్టోరీ మరిచిపోక ముందే మరో ఇద్దరు ఫేక్ పోలీసులు దొరికిపోయారు. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేయడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో నకిలీ ఖాకీల అసలు రంగు బయట పడింది. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్టేషన్ పరిధిలో మొత్తం ముగ్గురు నకిలీ పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. SOT పోలీసుల పేరుతో గత కొంతకాలంగా స్థానికులను బెదిరించి, డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఓ బ్యూటీ పార్లర్ సిబ్బందిని బెదిరించడంతో వీరి గుట్టు రట్టయింది. ఈనెల 11వ తేదీన కేపీహెచ్‌బీలోని 6వ ఫేజ్‌లోని బోధా బ్యూటీ పార్లర్‌లోకి SOT పోలీసుల పేరుతో ముగ్గురు ఎంటరయ్యారు. గంప సాయిహర్ష, కావెల అభిలాష్‌గౌడ్, రంగభాను ప్రసాద్‌గౌడ్‌లు తమను తాము SOT పోలీసులమని చెప్పుకున్నారు. డబ్బుల కోసం డిమాండ్ చేశారు. అయితే వీరిపై అనుమానం వచ్చిన బ్యూటీ పార్లర్ మేనేజర్ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అభిలాష్‌గౌడ్, భానుప్రసాద్‌గౌడ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నకిలీ పోలీస్ సాయిహర్ష కోసం గాలిస్తున్నారు.
ఇప్పటికే డిఎస్‌పి అవతారమెత్తిన ఫేక్ పోలీస్ నెల్లూరు స్వామిని రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఖాకీ డ్రెస్‌పై మోజు పెంచుకున్న నెల్లూరు స్వామి.. ఎలాగైనా ఆ డ్రెస్‌లోనే ఉండాలని కలలు కని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎస్సై కాకపోయే సరికి.. నకిలీ పోలీస్ అవతారమెత్తాడు. అందుకోసం అచ్చం పోలీస్ మాదిరిగానే ఖాకీ యూనిఫామ్‌ను కుట్టించుకున్నాడు. తర్వాత పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులతో తాను కూడా పోలీస్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ రోడ్డుపై హల్‌చేశాడు. అంతేకాదు ఉద్యోగం ఇప్పిస్తానని కొందరు అమాయకుల దగ్గరి నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేశాడు నెల్లూరు స్వామి. అటు సెటిల్‌మెంట్లకు కూడా పాల్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు మరో ముగ్గురు నకిలీ పోలీసులు పట్టుబడటంతో ఇంకా ఎంత మంది ఫేక్ ఖాకీలు ఉన్నారో అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన వారిని విచారిస్తున్నారు.
Also Read: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..