David Warner: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ఫీల్డ్‌లో ఎంత ఫేమస్సో... టిక్‌టాక్‌లోనూ అంతే ఫేమస్‌. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు వార్నర్‌.. క్రికెట్‌ స్టార్‌గా కన్నా...

David Warner: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..
David-Warner
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 19, 2021 | 4:14 PM

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ఫీల్డ్‌లో ఎంత ఫేమస్సో… టిక్‌టాక్‌లోనూ అంతే ఫేమస్‌. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు వార్నర్‌.. క్రికెట్‌ స్టార్‌గా కన్నా టిక్‌ టాక్‌ స్టార్‌గానే ఎక్కువగా పరిచయం. మరీ ముఖ్యంగా బన్నీ పాటలకు వార్నర్‌ వేసే స్టెప్పులు.. చేసిన వీడియోలు.. ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. టిక్‌ టాక్‌లో లెక్కలేనన్ని తెలుగు వీడియోలు చేసిన వార్నర్‌.. తన ఫేవరెట్‌ వీడియోను రివీల్ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి సైరా సినిమా ప్రీ క్లైమాక్స్‌లో చెప్పిన ‘ గెటౌవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’ అనే డైలాగ్‌ తన బెస్ట్ అంటూ తన సోషల్ మీడియాలో పేజ్‌లో షేర్‌ చేశారు. దీంతో ఫేస్‌ యాప్‌లో చేసిన ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

ఆ వీడియోను వీక్షించండి…

చిరంజీవి వీడియో మాత్రమే కాదు ఈ మధ్య రామ్ చరణ్ వీడియోతో కూడా పలకరించారు వార్నర్‌. వినయ విధేయ రామ సినిమాలో చెర్రీ చెప్పిన మాస్ డైలాగ్స్‌కు తన తలను తగిలించి రచ్చ చేశారు. ఇలా వరుసగా మెగా హీరోల వీడియోలతో టాలీవుడ్ ఆడియన్స్‌కు దగ్గరయ్యే పనిలో ఉన్నారు ఈ ఇంటర్‌నేషనల్‌ క్రికెటర్‌. కాగా ఐపీఎల్ లో సన్‌రైజర్స్ తరఫున ఆడటంతో మన ఆడియెన్స్ ఆయన బాగా దగ్గరైన విషయం తెలిసిందే.

Also Read: నెల్లూరు స్వామి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. అసలు కథ వేరే ఉంది..

ఆషాడ మాసంలో మునగాకు కూర ఎందుకు తింటారు..? అసలు దీని ప్రయోజనాలు ఏంటి..?