Monkeypox: మంకీ పాక్స్ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది..? లక్షణాలు, చికిత్స.. ఇతర వివరాలు
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వేవ్‌లు అంటూ..
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. పలు దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వేవ్‌లు అంటూ.. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎటు చూసినా కరోనా భయం వెంటాడుతోంది. కరోనా కోరల్లో విలవిల్లాడుతున్న ఈ సమయంలో.. ఇప్పుడు ఇదే చైనా నుంచి మరో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కరోనా పుట్టినిల్లు చైనాలో.. తాజాగా.. నమోదవుతున్న మంకీ బీ వైరస్ కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. చైనాలో కొద్ది రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన మంకీ బీ వైరస్ తొలి మరణం నమోదైంది. మంకీ బీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన దేశాలన్నింటి కంటే తొలి మరణం ఇదే. ఈ విషయాన్ని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్-సీడీసీ జర్నల్ నిర్థారించింది. మంకీ బీ వైరస్ వల్ల ఓ వెటరినరీ డాక్టర్ మృతి చెందినట్లు ధృవీకరించింది.
కోతుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ ఇది. ఈ వైరస్ సోకిన తరువాత తీవ్ర అనారోగ్యానికి గురైన… ఓ 57 సంవత్సరాల పశువైద్యుడు మృత్యువాత పడ్డాడు. ఆయన సన్నిహితులు గానీ, కుటుంబ సభ్యులు గానీ… ఈ వైరస్‌కు చెందిన ఎలాంటి లక్షణాలు లేవని.. వారందరూ సురక్షితంగానే ఉన్నారని చైనా మీడియా వెల్లడించింది. బీజింగ్‌కు చెందిన పశువైద్యుడు.. తన వృత్తిలో భాగంగా పరిశోధనల కోసం… ఈ ఏడాది మార్చిలో రెండు కోతుల కళేబరాలను ముక్కలు చేశాడు. ఆ కొద్దిరోజులకే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే.. ఆయన ఆరోగ్యం విషమించింది. మే 27వ తేదీన ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని పరీక్షించగా మంకీ బీ వైరస్ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
బీవీ గా పిలిచే మంకీ బీ వైరస్‌ను తొలిసారిగా మకాక్స్ అనే కోతి జాతిలో గుర్తించారు. 1932లోనే ఈ వైరస్ వ్యాప్తిలోకి వచ్చినట్లు తేల్చారు. ఇది కోతుల నుంచి నేరుగా మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించడానికి 80 శాతం వరకు అవకాశం ఉన్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన డ్రాగన్ కంట్రీలో మరో వైరస్ ఇప్పుడిప్పుడే ప్రాణాలను తీసే స్థాయికి చేరడంతో చైనా అప్రమత్తమైంది. దాన్ని నివారించడానికి తక్షణ చర్యలను తీసుకుంటున్నామని సీడీసీ తెలిపింది.
మరోవైపు… అమెరికా లోని డాలస్‌లో కూడా మంకీ పాక్స్ వైరస్ కేసు బయటపడింది. ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తికి మంకీ బీ వైరస్ సోకడం అమెరికా అధికారులను నివ్వెరపర్చింది. వైరస్ సోకిన వ్యక్తికి ప్రస్తుతం డాలస్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. ప్రస్తుతం అతని కాంటాక్ట్స్‌ని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అతనితో పాటు విమాన ప్రయాణం చేసినవారిని, ఇటీవల అతన్ని కలిసినవారిని గుర్తిస్తున్నారు. చివరిసారిగా 2003లో అమెరికాలో మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి. అప్పట్లో 47 మందికి ఈ వ్యాధి సోకింది. మిడ్‌వెస్ట్ ప్రాంతంలోని పెంపుడు కుక్కల్లో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మంకీ పాక్స్ కేసు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే… దీని గురించి అంతగా ఆందోళన చెందనక్కర్లేదని… దీనివల్ల సాధారణ ప్రజలకు ఎటువంటి ముప్పు లేదని అమెరికా అధికారులు చెబుతున్నారు. సీడీసీ ప్రకారం 100లో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మంకీ పాక్స్ జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా గాలి ద్వారా ఇది ఇతరులకు సోకే అవకాశం ఉంటుంది. వ్యాధి బారినపడినవారిలో జ్వరం, ముఖం, శరీర భాగాలపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దాదాపుగా 2-4 వారాల్లో ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది. మశూచి తరహా లక్షణాలకు ఈ లక్షణాలు దగ్గరగా ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం… రక్తం, శరీర స్రావాలు, జంతువుల గాయాల ద్వారా మంకీ పాక్స్ వ్యాప్తి చెందుతుంది. అర్థోపోక్స్ వైరస్ అనే జాతికి చెందిన వైరస్ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. సాధారణంగా పశ్చిమాఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటుంది. 1970లో మొదటిసారిగా కాంగోలో ఈ వ్యాధి బయటపడింది. ఇప్పటివరకూ పశ్చిమాఫ్రికాతో పాటు సెంట్రల్ ఆఫ్రికాలోని 9 దేశాల్లో ఈ వ్యాధి బయటపడింది. ఇటీవలే యూకెలోని నార్త్ వేల్స్‌లోనూ మంకీ పాక్స్ కేసులు నమోదైంది. నైజీరియా నుంచే ఈ వ్యాధి వ్యాప్తి చెందిందన్న అనుమానాలు ఉన్నాయి. 2018 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్‌కు, డిసెంబర్ 2019లో యూకె దేశాలకు, మే 2019లో సింగపూర్ దేశాలకు మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది.
మంకీ పాక్స్ వ్యాధి ఏ జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నది నిర్దారించేందుకు ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటికైతే దీనికి ప్రత్యేకించి ఏ వ్యాక్సిన్ అందుబాటులో లేదు. అయితే.. భవిష్యత్తులో దీనికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. స్మాల్ పాక్స్ వ్యాధి చికిత్సకు ఉపయోగించే జిన్నియోస్ వ్యాక్సిన్ మంకీ పాక్స్ నుంచి రక్షణ కల్పించగలదని అంచనా వేస్తున్నారు. కాంగోలో ప్రస్తుతం దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.
Also Read: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..