Hyderabad: కార్ కొనేందుకు వచ్చాడు.. షో రూమ్ వాళ్లు కీ ఇచ్చారు.. కట్ చేస్తే..
చిన్న మిస్టేక్, ఒకే ఒక్క చిన్న మిస్టేక్ చేస్తే చాలు లైఫ్ ఉల్టా అవుతుంది. ఒక్కోసారి జిందగీనే గల్లంతవుతుంది. తాజాగా ఓ కారు కొనడానికి వచ్చిన కస్టమర్....
చిన్న మిస్టేక్, ఒకే ఒక్క చిన్న మిస్టేక్ చేస్తే చాలు లైఫ్ ఉల్టా అవుతుంది. ఒక్కోసారి జిందగీనే గల్లంతవుతుంది. తాజాగా ఓ కారు కొనడానికి వచ్చిన కస్టమర్ అవగాహనా లోపం, షోరూమ్ యాజమాన్యం నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీశాయి. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఆల్కాపురిలో ఉన్న టాటా మోటార్స్ షోరూమ్‌కి కారు కొనేందుకు ఓ కస్టమర్ వచ్చాడు. అతను అక్కడున్న కార్లన్నీ చూసి ఓ మోడల్‌పై ఇంట్రస్ట్ చూపించాడు. దీంతో అక్కడి సిబ్బంది కీ ఇచ్చి టెస్ట్ చేయమన్నారు. అతడికి కారు డ్రైవింగ్ వచ్చా, అసలు కనీస అవగాహన ఉందా అనే అడిగే ప్రయత్నం కూడా చేయలేదు. తాళం అందుకున్న సదరు కస్టమర్.. వీర లెవల్‌లో కార్ స్టార్ట్ చేసి.. గేర్ వేశాడు. కట్ చేస్తే కారు రోడ్డుపై ఉన్న మరో కారుపై తుక్కుతుక్కైయి కనిపించింది. విషయం ఏంటంటే… సదరు కారు ఫస్ట్ ఫ్లోర్‌లో నుంచి దూసుకుని వచ్చి రోడ్డుపై ఉన్న మరో కారుపై పడిందన్నమాట. ఈ ప్రమాదంలో కార్ లో ఉన్న కష్టమర్ కు మరో బాబు కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఘటనతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రస్తుతం రెండు కార్లను అక్కడ్నుంచి పక్కకు నెట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు పోలీసులు. కాగా ఘటన నేపథ్యంలో షో రూమ్ యాజమాన్యంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదు కాబట్టి సరిపోయింది.. అదే ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు.
Also Read: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్..